ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రానికి అడ్డంకులు

ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రానికి అడ్డంకులు

ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రానికి అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి. సాహో ఫెయిల్ అయిన దగ్గర్నుంచి ఈ చిత్రంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కథ మొత్తం మార్చేసి అయిదు నెలల తర్వాత షూటింగ్ మొదలు పెడితే కరోనా బూచి వచ్చి వాళ్ళని విదేశాల నుంచి వెనక్కి పంపించింది.

యూరోప్ లోనే ఈ చిత్రాన్ని షూట్ చేద్దామని అనుకున్నారు కానీ ఇటీవల జార్జియా బెటర్ అని డిసైడ్ అయి అక్కడికి వెళ్లారు. ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ చేయడమే సాధ్యమయ్యేలా లేదు. లాక్ డౌన్ పూర్తయినా కానీ విదేశీ యాత్రలకి ఇప్పుడప్పుడే పర్మిషన్ రాకపోవచ్చు.

వేరే దేశాలు కూడా పరదేశీయులని ఇప్పట్లో ఆహ్వానించే పరిస్థితి లేదు. దీంతో ఈ చిత్రాన్ని ఇక్కడే ఎలా పూర్తి చేయాలనే దానిపై తలలు బాదుకుంటున్నారు. కథ నేపథ్యాన్ని ఇండియాకి మార్చడమే లేక సెట్స్ వేయడమా అనే దానిపై సమాలోచనలు జరుపుతున్నారు.