Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘మిర్చి’ సినిమా వరకు తెలుగులో ఒక చిన్న పాటి స్టార్ హీరో. కాని ‘బాహుబలి’ సినిమా తర్వాత టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడై ఇండియన్ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. 150 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ప్రభాస్ సన్నిహితులు అయిన వంశీ మరియు ప్రమోద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ రేంజ్‌లో హాలీవుడ్ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమా ప్రారంభంకు ముందే టీజర్‌ను విడుదల చేసి సంచలనం సృష్టించారు తప్పకుండా సినిమా అంతా ఆశించినట్లుగా ఓ రేంజ్‌లో ఉంటుందని అంటున్నారు. ఇక ప్రభాస్ ఆ తర్వాత ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడని అంతా భావిస్తున్నారు. అయితే రాధాకృష్ణ దర్శకత్వంలో కంటే ముందే వక్కంతం వంశీ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పలు చిత్రాలకు సూపర్ హిట్ కథలను అందించిన రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం చేయాలని గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఎన్టీఆర్‌తో సినిమా మొదలు పెట్టబోతున్నట్లుగా అధికారికంగా కూడా ప్రకటన వచ్చింది. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది. ఎన్టీఆర్‌తో సినిమా క్యాన్సిల్ అయినా కూడా అల్లు అర్జున్‌తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే చిత్రాన్ని ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఆర్మీ జవాన్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రం సక్సెస్ అయితే ప్రభాస్ ‘సాహో’ చిత్రం తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఉండబోతుంది.
‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ ఎంపిక చేసుకునే ప్రతి సినిమా విషయంలో కూడా జాగ్రత్త పడుతున్నాడు. ‘సాహో’ చిత్ర కథపై దర్శకుడు దాదాపు రెండు సంవత్సరాలు వర్క్ చేశాడు. ‘బాహుబలి’ రేంజ్‌లోనే అద్బుతంగా స్క్రిప్ట్‌ను సిద్దం చేసి ఈ సినిమాను తెరకెక్కించడం జరుగుతుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ‘బాహుబలి’ సినిమాతో భారీగా గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్ స్థాయి మరింత పెంచేలా సుజీత్ ‘సాహో’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు పరితపిస్తున్నాడు. ఇక ఆ తర్వాత ‘నాపేరు సూర్య’ చిత్రం సక్సెస్ అయితే ఖచ్చితంగా ప్రభాస్‌కు తగ్గ స్టోరీతో వక్కంతం వంశీ ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించడం ఖాయం అని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.