Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత నటిస్తున్న చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను ఏకంగా 150 కోట్లకు పైబడిన బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. బాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ చాలా స్టైలిష్‌గా, విభిన్నంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు మొదటి నుండి చెబుతున్నారు.
అన్నట్లుగానే ప్రభాస్ లుక్ చాలా క్లాస్‌గా, చాలా స్టైలిష్‌గా ఉందని ఫస్ట్‌లుక్ చూస్తేనే అర్థం అవుతుంది. చాలా రిచ్ లొకేషన్స్‌లో సినిమాను షూటింగ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఫస్ట్‌లుక్‌లో ఆ విషయం కూడా అర్థం అవుతుంది. ప్రభాస్ మొహానికి స్కార్ఫ్ వంటిది కట్టుకున్నా కూడా ఫ్యాన్స్ మాత్రం లుక్కు ఫిదా అవుతున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇప్పటి నుండే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత మరోసారి ప్రభాస్ నటిస్తున్న చిత్రం అదే స్థాయిలో ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా నేడు ఉదయం విడుదలైన ఈ ఫస్ట్‌లుక్‌కు ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫస్ట్‌లుక్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోకే కాకుండా ఇండియా వైడ్‌గా ట్రెండ్ అవుతుంది. ఈ విషయాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ సగర్వంగా చెబుతున్నారు. ప్రభాస్‌కు జోడీగా ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ నటిస్తుంది. ఇంకా ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు.