పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. నమ్మొచ్చా?

PSPK25 movie release on sankranthi,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ కోసం మెగా ఫ్యాన్స్‌ మరియు తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ ఈ చిత్రం ఖచ్చితంగా బ్లాక్‌ బస్టర్‌ రికార్డులను సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు. అందరు హీరోల ఫ్యాన్స్‌ కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించాడు కనుక. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మరియు పవన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాలు బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లు అయ్యాయి. అందుకే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే నిన్న మొన్నటి వరకు సినిమా షూటింగ్‌ కాస్త ఆలస్యం అవుతుందని, సంక్రాంతికి కూడా విడుదల అయ్యేది అనుమానమే అంటూ ప్రచారం జరిగింది. కాని చిత్ర నిర్మాణ సంస్థ నుండి ఒక స్పష్టమైన క్లారిటీ తాజాగా వెలువడినది.

దాని ప్రకారం పవన్‌ 25వ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9 లేదా 10న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ముందుగా అన్న ప్రకారం అయితే జనవరి 10న విడుదల చేయాల్సి ఉంది. కాని అంతకంటే ఒక్క రోజు ముందే సినిమాను విడుదల చేయబోతున్నారన్న మాట. త్వరలోనే సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. సినిమా ఆడియోను డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు. వచ్చే నెలలో టీజర్‌తో పాటు ఒకటి లేదా రెండు పాటలను విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.