కూర్చుంటే…డయాబెటిస్ ఖాయం…!

prakasams for diabitcs

శారీరక వ్యాయామం చేయకుండా అదేపనిగా, బద్ధకంగా కూర్చుని ఉండేవారికి డయాబెటిస్ ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మన రక్తసంబంధీకులకు మధుమేహం ఉండి మనం బద్ధకంగా ఉంటే మధుమేహం తప్పక వస్తుందని అంటున్నారు. శారీరక వ్యాయామాలు చేసేవారు ఒకపక్క బద్ధకంగా అదేపనిగా కూర్చుండిపోవడం, పడుకోవడం, టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్స్ ఆడటం వంటి వాటి వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో బ్రిటన్‌లోని లివర్‌పూల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఇందుకోసం వారు దాదాపు 45 మందిపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని తేల్చారు. వీరిపై 14 రోజుల పాటు వారి కార్యకలాపాలు, వారు చేసే శారీరక వ్యాయామాలు పరిశీలించారు. వీరి అధ్యయనంలో శారీరక వ్యాయామం చేయనివారి శరీరంలో కొవ్వు పెరిగిందని, ఇన్సులిన్‌కు వారి శరీరాలు ఏ మాత్రం స్పందించడం లేదని గుర్తించారు. అందునా రక్తసంబంధీకుల్లో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే ఆ పరిస్థితి మరీ దారుణంగా ఉందని తేల్చారు. రక్తంలో కొవ్వు పరిమాణం బాగా పెరిగినట్లు గుర్తించారు. శారీరక వ్యాయామం చేసేవారిలో ఇందుకు భిన్న ఫలితాలు రావడం గమనించారు. శారీరక వ్యాయామాల వల్ల ఎంతో మేలు జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.