“ప్రసన్నవదనం” – అందరిని ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా!

“Prasannavadanam” – An emotional drama that captivates everyone!
“Prasannavadanam” – An emotional drama that captivates everyone!

విడుదల తేదీ : మే 03, 2024

తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: సుహాస్,పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్,నితిన్ ప్రసన్న, నందు, హర్ష వర్ధన్,వైవా హర్ష, సాయి శ్వేత తదితరులు

దర్శకుడు: అర్జున్ వై.కె

నిర్మాత: మణికంఠ, ప్రసాద్ రెడ్డి

సంగీత దర్శకుడు: విజయ్ బుల్గానిన్

సినిమాటోగ్రఫీ: ఎస్.చంద్రశేఖరన్

ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ ఆర్

సుహాస్ హీరోగా వచ్చిన మూవీ ప్రసన్నవదనం. మరి ప్రేక్షకులని ఈ మూవీ ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

సూర్య ( సుహాస్ ) తన తల్లితండ్రులతో కలిసి కారులో వెళ్తూ ఉండగా వారి కారు యాక్సిడెంట్ కు గురవుతుంది. ఆ ప్రమాదంలో సూర్య వాళ్ళ తల్లి తండ్రులు చనిపోతారు. సూర్య కు ఫేస్ బ్లైండ్ నెస్ అనే ఒక అరుదైన వ్యాధి వస్తుంది . మరోవైపు సూర్య రేడియో మిర్చిలో జాకీగా పని చేస్తుంటారు . ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సూర్యకు ఆధ్య (పాయల్ రాధాకృష్ణ)తో పరిచయం అవుతుంది. వీరిద్దరూ ప్రేమలో పడతారు. ఐతే, అమృత (సాయిశ్వేత) అనే అమ్మాయి హత్య కేసులో సూర్య ఇరుక్కుంటారు . అసలు అమృత ఎవరు ?, ఆమెని చంపంది ఎవరు ?, ఈ మొత్తం వ్యవహారంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వైదేహి (రాశీ సింగ్ ) పాత్ర ఏంటి ?, అసలు నేరస్తుల్ని సూర్య ఎలా పట్టుకున్నాడు?, అమృత కేసు నుంచి సూర్య ఎలా తప్పించుకున్నాడు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఫేస్ బ్లైండ్ నెస్ అనే కాన్సెప్ట్ తో సాగిన ఈ ‘ప్రసన్నవదనం’ మూవీ లో కొన్ని కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. హీరోగా సుహాస్ సూర్య పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్, అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలను .. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ఈ మూవీ కొన్నిచోట్ల బాగానే ఆకట్టుకుంది. సుహాస్ కూడా తన యాక్టింగ్ తో అండ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు . ఫేస్ బ్లైండ్ నెస్ తో బాధ పడే సూర్య పాత్రలో సుహాస్ చాలా బాగా ఒదిగిపోయారు .

“Prasannavadanam” – An emotional drama that captivates everyone!
“Prasannavadanam” – An emotional drama that captivates everyone!

ఇక హీరోయిన్ గా నటించిన పాయల్ రాధాకృష్ణ తన లుక్స్ తో ఆకట్టుకుంది. అలాగే ఈ మూవీ లో మరో కీలక పాత్రలో నటించిన రాశీ సింగ్ తన నటనతో మెప్పించింది. ఆమె పాత్ర కూడా చాలా బాగుంది. మరో కీలక పాత్రల లో నందు చాలా బాగా నటించాడు. అలాగే నితిన్ ప్రసన్న, , హర్ష వర్ధన్,వైవా హర్ష, సాయి శ్వేత చాలా బాగా నటించాడు . అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు అర్జున్ వై.కె ఫేస్ బ్లైండ్ నెస్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు, కానీ.. ఆ లైన్ ని పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేదు. హీరో- హీరోయిన్ మధ్య సాగే సీన్స్ కూడా బాగా స్లోగా సాగుతాయి. అలాగే వారి ప్రేమకి బలమైన సంఘర్షణ కూడా లేదు. ఇక హీరో పాత్ర కూడా సాయం చేయడానికే ఉన్నది అన్నట్టు చాలా సీన్స్ లో ఆ ట్రాక్ నే ఇరికించారు.

దీనికితోడు అనవసరమైన ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోయాయి. పైగా మూవీ ఈ స్లో నేరేషన్ తో సాగింది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సీన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. ఇక సెకండాఫ్ ను కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేశాడు, కానీ ఎక్కడాకూడా ఆ ఎమోషన్ వర్కౌట్ కాలేదు. పైగా సిల్లీ ఎమోషన్స్ చుట్టూ పేలవమైన సీన్స్ తో మూవీ ని సాగదీశారు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి చెప్పుకుంటే.. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం బాగుంది. అలాగే కొన్ని సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ఎడిటర్ తన ఎడిటింగ్ తో మ్యానెజ్ చేయలేకపోయారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు అర్జున్ వై.కె ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. ఇక మూవీ లోని నిర్మాతలు మణికంఠ, ప్రసాద్ రెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా బాగున్నాయి.

తీర్పు :

ప్రసన్నవదనం అంటూ వచ్చిన ఈ మూవీ లో మెయిన్ పాయింట్ అండ్ కొన్ని కామెడీ సీన్స్ మరియు ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. కానీ, కొన్ని సీన్స్ రెగ్యులర్ గా సాగడం, సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే సింపుల్ గా సాగడం వంటి అంశాలు మూవీ కి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ మూవీ లో మెయిన్ కాన్సెప్ట్ అండ్ కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి