Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మంత్రివర్గం నుంచి బయటకు వచ్చినా ఏదో విధంగా రావెల కిషోర్ బాబు టీడీపీ సర్కార్ ని ఇబ్బంది పెడుతూనే వున్నారు. క్యాబినెట్ నుంచి తప్పించాక కిషోర్ బాబు వ్యవహారశైలి మీద సీఎం చంద్రబాబుకి ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు వెళ్లాయట. క్యాబినెట్ స్థానం కోల్పోయాక ఆయన బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసినట్టు ఇంటలిజెన్స్ కూడా సీఎం కి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ కి అనుకూలంగా వ్యవహరిస్తూ బాబుని ఇబ్బంది పెట్టేలా అడుగులు వేస్తున్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో నిజానిజాలు తెలుసుకోవడం మీద చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం.
ఓ వైపు రావెల మీద టీడీపీ సర్కార్ పెద్దలు ఇలా డౌట్ పడుతుండగానే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రావెల ఆహ్వానం మేరకు మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రత్తిపాడు నియోజకవర్గ పర్యటనకు వెళ్లారు. అయితే ఇంటి రుణాల మంజూరు విషయంలో రావెల అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపిస్తూ స్థానికులు అయ్యన్న కాన్వాయ్ కి అడ్డం పడ్డారు. వాళ్ళు అంతకన్నా దారుణమైన విషయం బయటకు చెప్పారు. ఇళ్ల మంజూరులో టీడీపీ మద్దతుదారుల్ని పక్కనబెట్టి వైసీపీ వారికి వంత పాడుతున్నారని మంత్రి ఎదుటే ఆరోపించారు. దీంతో అయ్యన్న షాక్ తిన్నారు. స్థానికులకు నచ్చజెప్పి పోలీసుల సాయంతో మంత్రి అక్కడ నుంచి బయటపడ్డారు. ఈ పరిణామం కూడా హైకమాండ్ దృష్టికి వెళితే రావెల కి ఇబ్బందులు తప్పవనుకుంటా.
మరిన్నివార్తలు
నంద్యాలలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ
చంద్రులిద్దరికీ మోడీ స్వీట్ న్యూస్.
ఖాకీ అలా పిలిస్తే వంకలు తిరుగుతున్నారు.