సాధారణంగా కామంతో కన్నుమిన్ను కానని వాడిని చిత్త కార్తె కుక్కతో పోలుస్తారు, అంటేకుక్కలు కూడా కేవలం ఆకార్తెసమమంలో అలా ప్రవర్తిస్తాయి. కానీ ఇటీవలవెలుగులోకి వచ్చిన ఒక ఘటన ఏమి అనాలో కూడా అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది. ఎనిమిది మంది యువకులు ఓ మేక మీద.. అదీ కడుపుతో ఉన్న మేక మీద గ్యాంగ్ రేప్ చేశారు. ఔను మీరు చదివింది నిజమే. కన్ను మిన్ను కానని ఎనిమిది మంది తాగుబోతు యువకులు గర్భంతో ఉన్న ఒక మేక మీద అత్యాచారం చేశారు. దీంతో ఆ మేక మృతిచెందింది. ఈ ఘటన హర్యానాలోని మేవాట్‌లో గత బుధవారం రాత్రి జరిగింది. ఆ మేక యజమాని ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మేవాట్‌లోని నాగినా పోలీస్ స్టేషన్ పరిధిలో అస్లు అనే వ్యక్తి గురువారం ఉదయం పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు ఇచ్చాడు. తన మేక మీద కొందరు అత్యాచారానికి ఒడిగట్టారని చెప్పగానే పోలీసులు షాక్ అయ్యారు. మద్యం తాగి వచ్చి ఏదో వాగుతున్నదనుకున్నారు. అయితే, అతను చెప్పేది నిజమని తేలడంతో విచారణ ప్రారంభించారు. పోలీసుల వివరాల ప్రకారం పోలీసులు వివరాల ప్రకారం.. మరోదా గ్రామానికి చెందిన అస్లు అనే వ్యక్తికి మేకలు ఉన్నాయి. జూలై 25న తన మేకల్లో ఒకటి అదృశ్యమైనట్లు అస్లు గుర్తించాడు. దీంతో దాన్ని వెతకడం మొదలుపెట్టాడు. ఒక చోట తన మేకపై కొంత మంది యువకులు లైంగిక చర్యకు పాల్పడటం చూసి షాకయ్యాడు. గట్టిగా అరవడంతో వారంతా అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో మేక అక్కడే చనిపోయింది.
దీంతో గ్రామస్థుల సూచన మేరకు అస్లు జూలై 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సావకర్, హరూన్, జాఫర్ అనే ముగ్గురితో పాటు మరో ఐదుగురు స్నేహితులు గత బుధవారం రాత్రి ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఈ చర్యకు పాల్పడ్డారు. వారు డ్రగ్ నిషాలో ఉండి ఈ పని చేసినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఎనిమిది మంది పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరిపై ‘జంతువులపై క్రూరత్వం నివారణ చట్టం, 1960’తో పాటు ఐపీసీ సెక్షన్ 34, 377, 429 కింద కేసులు నమోదు చేసినట్లు నాగిన పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో విపిన్ కుమార్ వెల్లడించారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.