కరోనా వైరస్‌తో గర్భిణులకు అధికంగా ముప్పు ఉండే అవకాశాలున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తాజా అధ్యయనంలో వెల్లడైంది. గర్భిణులకు కరోనా వైరస్ సోకితే ఎన్నో రకాల ఇతర వ్యాధులు కూడా వారిలో విజృంభిస్తాయని ఆ అధ్యయనం తెలిపింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ఈ అధ్యయనం వివరాలను ప్రచురించారు.
దాని ప్రకారం కరోనా సోకిన గర్భిణుల్లో తొమ్మిది నెలలు నిండకుండానే ప్రసవం జరగడం, హైపర్ టెన్షన్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోవిడ్–19తో మహిళలు ప్రసవిస్తే వారిలో ఎనీమియా, డయాబెటీస్ వంటివి పెరిగిపోయి తల్లుల మరణానికి దారి తీసే అవకాశాలున్నాయి.