జ్యోతిష్యుడు చెప్పాడని… భార్య గర్బంపై తన్నేశాడు.. తీవ్ర రక్తస్రావమై..

Husband Killed His Pregnant Wife At Vijayawada

ఈ కాలం కలికాలం అందులో అత్యాధునిక వసతి సౌకర్యాలున్న కాలం. ఇప్పుడు కూడా జనాలు మూఢ నమ్మకాలు నమ్మి ప్రణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరు మూర్ఖులు మూఢనమ్మకాలతో దారుణాలకు పాల్పడుతున్నారు. రెండో బిడ్డ పుడితే తండ్రి చనిపోతాడని తనకు జ్యోతిష్యుడు చెప్పాడంటూ ఓ కసాయి భర్త గర్భిణి భార్యపై దాష్టీకానికి ఒడిగట్టాడు. అయితో గర్భంతో ఉందన్న కనికరం కూడా లేకుండా కడుపుపై కాలితో తన్నడంతో ఆమెకు గర్భస్రావమైంది. కడుపులో బిడ్డ చనిపోయేందుకు కారణమైన భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. కాగా ఈ అమానుషమైన ఘటన తమిళనాడులోని అమ్మపేట పరిధిలో జరిగింది.

తమిళనాడులోని ములియానూర్‌కి చెందిన మునుస్వామ, రమ్య భార్యాభర్తలు. వారిద్దరికీ సుమారు ఆరేళ్ల కిందట పెళ్లైంది. మొదట ఒక బాబు పుట్టాడు. రెండోసారి రమ్య గర్భం దాల్చింది. ఓ రోజు జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లిన మునుస్వామి తన భార్య గర్భంతో ఉందని చెప్పాడు. అయితే రెండో బిడ్డ పుడితే తండ్రి ప్రాణాలకు ముప్పు ఉందని జ్యోతిష్యుడు చెప్పాడు. దీంతో ఆ తండ్రి దారుణానికి తెగబడ్డాడు. రెండోబిడ్డ పుడితే తన ప్రాణాలు పోతాయని స్వామీజీ చెప్పారని.. అబార్షన్ చేయించుకోవాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె ససేమిరా అనడంతో కోపం పెంచుకున్నాడు. దీంతో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మునుస్వామి భార్యని తీవ్రంగా కొట్టాడు. అబార్షన్ చేయించుకోనని మొండికేయడంతో గర్భిణి కడుపుపై కాలితో బలంగా తన్నడంతో ఆమె కిందపడిపోయింది. కడుపులో తన్నడంతో తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిన రమ్యని స్థానికులు తల్లిదండ్రుల వద్దకు పంపించారు. పుట్టింటికి వెళ్లిన తర్వాత కూడా ఆమెకు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షలు నిర్వహించినవ వైద్యులు రమ్యకి గర్భస్రావం అయినట్లు చెప్పారు. కడుపుపై తన్ని గర్భస్థ శిశువు మరణానికి కారణమైన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ భార్య పోలీసులను ఆశ్రయించింది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం అంటే భర్తకోసం తీవ్రంగా గాలింపు చర్యలకు దిగారు.