కులం పేరుతో డాక్టర్ ని దూషించిన అర్చకుడు

కులం పేరుతో డాక్టర్ ని దూషించిన అర్చకుడు

కులం పేరుతో ఓ అర్చకుడు దూషించాడు. గుడికి వచ్చిన భక్తురాల్ని నానా మాటలు అన్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చిన ఓ మహిళా భక్తురాలిని కులం పేరుతో దూషించిన అర్చకుడిపై ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. భక్తురాలి ఫిర్యాదుతో అర్చకుడ్ని విచారిస్తున్నారు.

నగరంలోని వెంగళరావునగర్‌ డివిజన్‌లోగల శ్రీరామాంజనేయ దేవాలయానికి ఓ వైద్యురాలు దర్శనం కోసం ఇటీవల వెళ్లారు. అయితే అక్కడ ఆలయంలో ఉన్న అర్చకుడు వెంకటరత్నం కులం పేరుతో తనను అవమానించాడని డాక్టర్ ఆరోపిస్తున్నారు. తీర్థప్రసాదాలు ఇవ్వనని వైద్యురాలు అడగ్గా కేకలు వేశాడని భక్తురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్చకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. భక్తురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.