నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడో దుర్మార్గుడు. ఆడుకుంటున్న చిన్నారిని తీసుకెళ్లి అమానుషంగా రేప్ చేశాడు. బనగానపల్లె మండలంలోని ఓ గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి ఉదయం 10 గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటుండగా తమ్మడపల్లె గ్రామానికి చెందిన రుద్రేష్ కన్నేశాడు.

పాపను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు సమాచారం. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అత్యాచారం, పోక్సో తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.