Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మనదేశంలో సినీ హీరోలకుండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ రాష్ట్రంలో అయినా అక్కడి స్టార్ హీరోలకు, పెద్ద సంఖ్యలో అభిమానులు ఉంటారు. ఆ హీరో చెప్పినదాన్ని తుచ తప్పకుండా ఆచరించేందుకు వారు సిద్దంగా ఉంటారు. అందుకే రాజకీయ నేతలు ఆ హీరో ద్వారా ఆయన అభిమానులన్ని తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు నేతలు తాము తలపెట్టిన ప్రజాహిత కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు స్టార్లతో కలిసి పనిచేస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి మోడీ ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ను ఒక కోరిక కోరారు.
కేంద్రప్రభుత్వం తలపెట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగస్వామి కావాలని కోరుతూ ఆయన… మోహన్ లాల్ కు లేఖరాశారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పేదలకు ఎంతో సేవ చేసినట్టు అవుతుందని, సినీరంగంలో ఉన్న ప్రత్యేక గుర్తింపుతో ప్రజల జీవితాల్లో పాజిటివిటీ నింపే శక్తి మోహన్ లాల్ కు ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి మోహన్ లాల్ సహకరిస్తే …ఆయన స్ఫూర్తితో కొన్ని లక్షల మంది భారతీయులు ముందుకు వస్తారని, ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని మోడీ లేఖలో పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ సాధన దిశగా మోహన్ లాల్ కొంత సమయం కేటాయించాలని కోరారు.