టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటీనటులు ఉన్న సంగతి తెలిసిందే. కానీ కొంతమందికి మాత్రమే మంచి కెరీర్ ఉంటుంది. అలా అప్పట్లోనే ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న వారిలో బబ్లు పృధ్వివీరాజ్ ఉన్నారు. బబ్లు పృధ్వివీరాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కర్ణాటక రాష్ట్రంలో పుట్టి పెరిగిన పృథ్వి… మొదటగా తమిళ ఇండస్ట్రీలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యాడు.
1971 సంవత్సరంలో తమిళ చిత్ర పరిశ్రమంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత మలయాళం, తెలుగు, కన్నడ మూవీ లలో కనిపించి అందరిని మెప్పించాడు. పృద్వి ఎక్కువగా తెలుగులో సినిమాలు చేయడం గమనార్హం.ఈ మధ్యకాలంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పృథ్వి… చివరగా ఊర్వశివో రాక్షసివో అనే సినిమాలో కనిపించాడు. అటు యానిమల్ సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నాడు పృద్వి.
ఇదంతా పక్కకు పడితే పృథ్వి గురించి ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పృద్వి మరియు బీన ఇద్దరికీ పెళ్లయింది. వీరికి 27 సంవత్సరాల కుమారుడు ఉండగా ఇద్దరు కూడా విడిపోయారు.అయితే పృద్వి ప్రస్తుతం 25 సంవత్సరాలు ఉన్న శీతల్ అనే అమ్మాయితో పృద్వి రిలేషన్ షిప్ లో ఉన్నాదంట . అయితే దీనిపై తాజాగా పృథ్వి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శీతల్ చాలా మంచి మనసు ఉన్న అమ్మాయి… ఆమె నేను ఇద్దరం ప్రేమించుకున్నాం త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అని పృథ్వి ప్రకటించారు. ఇద్దరికీ ఇష్టం కనుక పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు.