సినీనటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి తాజాగా సినీ పెద్దల మీద చేసిన కామెంట్స్‌ని ఖండించారు సినీనటుడు, పోసాని కృష్ణమురళి. తన ఆరోగ్యపరిస్థితిపై వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పోసానిని పృథ్వి కామెంట్స్‌పై ప్రశ్నించగా వైఎస్ జగన్ సీఎం కావడం సినీ పెద్దలకు ఇష్టంలేదనడం కరెక్ట్ కాదని అన్నారు.
పృథ్వి తొందరపడి మాట్లాడారని అనుకుంటున్నాని వ్యాఖ్యానించారు. సినిమా ఇండస్ట్రీకి చెందినవాళ్లలో కొందరికి చంద్రబాబు సీఎం కావాలని ఉండొచ్చు.. కానీ, జగన్ సీఎం అయితే, ఆహ్వానించకుండా ఉండేవాళ్లు మాత్రం ఎవరూ లేరని అన్నారు. ఇప్పటికే దగ్గుబాటి సురేష్ బాబు, సీఎం జగన్‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారని అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా అది సాధ్యం కాలేదు.
త్వరలోనే సినీ పెద్దలు సీఎంను కలుస్తారని స్పష్టం చేశారు. ఈ విషయం బహుశా పృథ్వికి తెలియదేమో అని పేర్కొన్నార్న్నారు. ప్రజలకు వైఎస్ జగన్ నచ్చాడని అందుకే 150 స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలను గెలిపించారని ప్రజల కంటే పవన్ కల్యాణ్, పోసాని కృష్ణమురళి, నారా లోకేష్ గొప్పకాదన్నారు. తనను నమ్ముకున్న ప్రజలను నచ్చింది సీఎం వైఎస్ జగన్ చేస్తూ పోతే చాలని అన్నారు పోసాని.