ప్రియా ప్ర‌కాశ్ కు బంప‌ర్ ఆఫ‌ర్

Priya Prakash Varrier gets Bumper Offer
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఓవ‌ర్ నైట్ స్టార్ అన్న‌ప‌దానికి ప్ర‌స్తుతం ప్రియా ప్రకాశ్ వారియ‌ర్ మించిన ఉదాహ‌ర‌ణ‌లేదు. ఒక్క‌వీడియోతో సోష‌ల్ మీడియా పుణ్యమా అని దేశ‌వ్యాప్తంగా సెల‌బ్రిటీ అయిపోయిన ప్రియాకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నుంచి వ‌రుస అవ‌కాశాలు వ‌స్తున్నాయి. అదే సమ‌యంలో సోష‌ల్ మీడియాలోనూ ఆమెను ఫాలో అవుతున్న అభిమానుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో అతి త‌క్కువ స‌మ‌యంలోనే ప్రియ‌కు 5.8 మిలియ‌న్ల‌మంది ఫాలోవ‌ర్ల‌గా మారిపోయారు. ఇది ప్రియ‌కు కొత్త ఆదాయ వన‌రుగా మారింది. ఆమెకున్న క్రేజ్ ను ఉప‌యోగించుకునేందుకు ప‌లు కంపెనీలు క్యూ క‌డుతున్నాయి. త‌మ ఉత్ప‌త్తుల‌కు ప్ర‌చారం చేసి పెట్టాల‌ని ప‌లు కంపెనీలు ఆమెను కోరుతున్నాయి.

ప్రియ ఇన్ స్టాగ్రామ్ తో పాటు ఇత‌ర సోష‌ల్ మీడియా ఎకౌంట్స్ లో త‌మ ఉత్ప‌త్తి గురించి పోస్ట్ పెడితే… భారీ స్థాయిలో రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేస్తున్నాయి. ఒక పోస్టుకు అక్ష‌రాలా రూ. 8ల‌క్ష‌లు దాకా ఇస్తామంటూ ప‌లు సంస్థ‌లు ఆఫ‌ర్ చేస్తున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాక‌ముందే ప్రియా ప్ర‌కాశ్ కు ఈ స్థాయిలో వ‌స్తున్న ఆఫ‌ర్ల‌పై సినీ వ‌ర్గాలు సైతం విస్మ‌యం వ్య‌క్తంచేస్తున్నాయి. బాలీవుడ్ న‌టి సోన‌మ్ క‌పూర్ లాంటి వారికి మాత్ర‌మే సోష‌ల్ మీడియాలో ఈ క్రేజ్ ఉంది. ఆమె ఒక్కో పోస్టుకు భారీ మొత్తంలో వ‌సూలు చేస్తుంది. ప్రియా ప్ర‌కాశ్ కూడా ఇప్పుడు సోన‌మ్ స‌ర‌స‌న చేరింది.