Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మలయాళ చిత్రం ‘ఒరు అదార్ లవ్’ గురించి వారం రోజుల ముందు వరకు కనీసం మలయాళ ప్రేక్షకులకు కూడా పూర్తిగా తెలిసి ఉండదు. కాని ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆ చిత్రం చర్చ జరుగుతుంది. ఒరు అదార్ లవ్ చిత్రంలోని ఒక పాటను విడుదల చేయడం జరిగింది. ఆ పాటలో హీరోయిన్ ప్రియ వారియర్ కన్ను కొట్టడంతో పాటు, ఆమె హావభావాలతో కుర్రకారు గుండెలను బద్దలు కొట్టింది. భారీ స్థాయిలో ప్రియ వారియర్‌కు క్రేజ్ దక్కింది. ప్రియ దక్కించుకున్న క్రేజ్‌తో సినిమాకు కూడా విపరీతమైన పబ్లిసిటీ దక్కింది. కేవలం కోటి రూపాయల బడ్జెట్‌తో అంతా కొత్త వారితో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 10 కోట్లకు పైగా చేస్తుందని సమాచారం అందుతుంది.
తెలుగులో ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్‌ను దక్కించుకునేందుకు ప్రముఖ నిర్మాత ఏకంగా రెండు కోట్లను ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో కూడా ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసేందుకు ఔత్సాహిక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఇక కేరళలో స్థానిక డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈచిత్ర పంపిణీ రైట్స్ కోసం ఎగబడుతున్నారు. సినిమాను కేవలం కోటి రూపాయలతో నిర్మించిన నిర్మాత ఖాతాలో ఇప్పుడు ఏకంగా పది కోట్లకు పైగా పడబోతున్నాయి. ప్రస్తుతం నిర్మాణదశలోనే ఉన్న సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి బిజినెస్ లెక్కలు ఏ చిత్రానికి నమోదు కాలేదు. ఈ చిత్ర నిర్మాత అదృష్టం కొద్ది లాభాల వర్షం కురుస్తుంది. ఈ లాభాలకు పూర్తిగా ప్రియా వారియర్ కారణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.