నటి ప్రియమని తాజా నటించిన చిత్రం భామకలాపం. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇందులో తన నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. గతేడాది ఆమె నటించిన నారప్ప మూవీ కూడా సూపర్ హిట్ కొట్టింది. ఇలా వరస హిట్లు అందుకున్న ప్రియమణి తాజా వెబ్ సిరీస్ సక్సెస్తో ఒక్కసారిగా రెమ్యునరేషన్ పెంచేసిందనే టాక్ వినిపిస్తోంది.
ఈ వెబ్ సిరీస్కు గాను ప్రియమణి రోజుకు దాదాపు 1.5 లక్షల రూపాయలు తీసుకుందని, ఇప్పుడు ఏకంగా రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల వరకు డిమాండ్ చేస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా ప్రస్తుతం ప్రియమణి.. రానా తాజా చిత్రం విరాటపర్వం సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.