భావనకు శుభాకాంక్ష‌లు చెప్పిన ప్రియాంక చోప్రా

Priyanka Chopra wishes Bhavana on her wedding

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

హీరోయిన్ భావ‌న పెళ్లికూతుర‌యింది. చిర‌కాల స్నేహితుడు న‌వీన్ ను పెళ్లాడ‌నునంది. న‌వీన్ క‌న్న‌డ సినిమా నిర్మాత‌. త్రిసూర్ లో కుటుంబ స‌భ్యులు, స్నేహితుల స‌మ‌క్షంలో పెళ్లి జ‌ర‌గ‌నుంది. హీరోయిన్ గా క‌న్నా త‌న‌పై జ‌రిగిన లైంగిక దాడితో జాతీయ స్థాయిలో వార్త‌ల్లో నిలిచింది భావ‌న‌. సాధార‌ణ అమ్మాయి త‌ర‌హాలో ఆమెపై గ‌త ఏడాది కేర‌ళ నటుడు దిలీప్ చేయించిన లైంగిక దాడి పెను సంచ‌ల‌నం సృష్టించింది. స‌మాజంలో వీఐపీ గౌర‌వం ల‌భించే హీరోయిన్ పై లైంగిక దాడి జ‌ర‌గ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌యింది. త‌న‌పై జరిగిన దారుణంపై ఆమె ధైర్యంగా ఫిర్యాదుచేసింది. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దిలీప్ ను అరెస్ట్ చేశారు.

Priyanka-Chopra-wishes-Mala

ఈ కేసుపై ఇప్పుడు కేర‌ళ‌లో విచార‌ణ జ‌రుగుతోంది. త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న భావ‌న‌ను అంద‌రూ ప్ర‌శంసించారు. ఆ ప్ర‌భావం నుంచి బ‌య‌ట‌ప‌డి కోరిన వ్య‌క్తిని పెళ్లిచేసుకుంటున్న భావ‌న‌కు పలువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ న‌టి ప్రియాంక భావ‌న‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్న వీడియో నెట్ లో వైరల్ గా మారింది.

Priyanka-Chopra-wishes-Bhav

ఈ వీడియోలో ప్రియాంక భావ‌న‌ను గొప్ప మ‌హిళ‌గా, ధైర్య‌వంతురాలిగా కొనియాడింది. నీకు పెళ్లి సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు. నీ జీవితంలో కొత్త అడుగు వేయ‌బోతున్నావ్. అందుకు నీకు గుడ్ ల‌క్. నువ్వొక అమేజింగ్ ఉమెన్. నువ్వంటే నాకు చాలా గౌర‌వం. అని ప్రియాంక వీడియోలో శుభాకాంక్ష‌లు తెలిపింది. గ‌త ఏడాది మార్చిలో భావ‌న‌, న‌వీన్ ల వివాహ నిశ్చితార్థం జ‌రిగింది.