ప్రముఖ నిర్మాత మృతి…విషాదంలో టాలీవుడ్

టాలీవుడ్ లో సీనియర్ నిర్మాత బి.వెంకట్రామిరెడ్డి ఈరోజు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఈరోజు చెన్నైలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన విజయ వాహిని స్టూడియోస్ బ్యానర్‌ మీద ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, భానుమతి వంటి నటులతో సినిమాలు నిర్మించిన నిర్మాత బి.నాగిరెడ్డి చిన్న కుమారుడే వెంకట్రామిరెడ్డి. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ విజయ బ్యానర్‌పై తెలుగులో ‘శ్రీకృష్ణార్జున విజయం’, ‘బృందావనం’, ‘భైరవ ద్వీపం’ వంటి భారీ సినిమాలను వెంకట్రామిరెడ్డి నిర్మించారు. తమిళంలో అజిత్, విజయ్, ధనుష్, విశాల్ వంటి స్టార్ హీరోలతోనూ కొన్ని సినిమాలు చేశారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఈరోజు కన్ను మూశారు. వెంకట్రామిరెడ్డి అంత్య క్రియలు సోమవారం ఉదయం 7 నుంచి 9.30 గంటల మధ్య చెన్నైలో జరగనున్నాయి.