ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి(పీవీపీ), బండ్ల గణేష్ మధ్య జరుగుతున్న వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. టెంపర్ సినిమా విషయంలో వచ్చిన విబేదాల వల్ల పీవీపీకి, బండ్ల గణేష్ మధ్య గొడవ మొదలై అది కాస్త పోలీస్ కేసు వరకూ వెళ్ళింది. దీంతో ఈ ఇద్దరి మధ్య ఉన్న వివాదం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
అర్థరాత్రి వేళ అనుచరులతో బండ్ల గణేష్ కాగా కొద్ది రోజుల క్రిందట బండ్ల గణేష్, అర్థరాత్రి వేళ తన అనుచరులతో వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడని పీవీపీ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ కోసమై బండ్ల గణేష్ ఇంటికి, ఆఫీసుకు వెళ్లగా ఆయన కనిపించక పోవడంతో.. బండ్ల గణేష్ పరారీలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ మేరకు నిన్న ఆయన కనిపించడంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
బండ్ల గణేష్ అరెస్ట్ తర్వాత ఈ కేసులో జోక్యం చేసుకున్న కడప మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తునట్లుగా పేర్కొంది. నవంబర్ 4వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధిస్తునట్లుగా మేజిస్ట్రేట్ కోర్టు ప్రకటించింది.
బండ్ల గణేష్‌పై ఇలాంటి వివాదాలు, కేసుల కొత్తేమీ కాదు. ‘నీజతగా నేనుండాలి’ సినిమా విషయంలో హీరో సచిన్ జోషికి, బండ్ల గణేష్‌కు బేదాభిప్రాయాలు రావడం.. ఒకరినొకరు దూషించుకున్న సంగతి తెలిసిందే. దీంతో బండ్ల గణేష్ వ్యవహారం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.