Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో వరుసగా చిత్రాలు చేస్తున్న నిర్మాత రాధాకృష్ణ. త్రివిక్రమ్‌కు కేవలం నిర్మాతగా మాత్రమే కాకుండా ఆప్త మిత్రుడిగా కూడా రాధాకృష్ణ మారినట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. రాధాకృష్ణ బ్యానర్లో సినిమా చేయడం వల్ల బడ్జెట్ గురించిన ఆందోళన అవసరం లేదని, ఎంత బడ్జెట్‌తో సినిమా తీసినా కూడా ఆయన ప్రశ్నించరు. పూర్తి స్వేచ ఇవ్వడంతో పాటు, తాను డిమాండ్ చేయకుండానే మంచి పారితోషికం ఇవ్వడం వంటి కారణాల వల్ల త్రివిక్రమ్ వరుసగా హారిక అండ్ హాసిన బ్యానర్లోనే సినిమాలు చేస్తున్నాడు. ముందు ముందు కూడా ఆ బ్యానర్లోనే త్రివిక్రమ్ సినిమాలు ఉంటాయని తెలుస్తోంది. నిర్మాత రాధాకృష్ణ తన సినిమాలో చేసే వారికి కేవలం పారితోషికాలు మాత్రమే కాకుండా ఖరీదైన బహుమానాలు కూడా ఇస్తూ ఉంటాడు.
ఆమద్య ‘అజ్ఞాతవాసి’ సమయంలో పవన్‌కు చాలా విలువైన బహుమానంను ఇచ్చిన నిర్మాత రాధాకృష్ణ తాజాగా త్రివిక్రమ్‌కు ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. నిర్మాత కారు బహుమానంగా దర్శకుడికి ఇవ్వడం చాలా కామన్. కాని ఒకే సినిమా సమయంలో దర్శకుడితో పాటు హీరోకు కూడా ఖరీదైన బహుమానాలు ఇవ్వడం అరుదుగా చూస్తూ ఉంటాం. ఇటీవలే త్రివిక్రమ్‌కు బహుమానం ఇచ్చిన రాధాకృష్ణ తాజాగా ఎన్టీఆర్‌కు అంతకు మించిన ఖరీదైన బహుమానంను ఇచ్చినట్లుగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇలాంటి బహుమానాలు ఎన్టీఆర్‌కు ఇష్టం ఉండవని, కాకుంటే నిర్మాత రాధాకృష్ణ ఇచ్చిన బహుమానం ఆయనకు చాలా నచ్చడం వల్ల తీసుకున్నాడు అంటూ విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. మొత్తానికి నిర్మాత రాధాకృష్ణ బహుమానాలు ఇచ్చేసి మళ్లీ ఎన్టీఆర్ డేట్స్ తీసుకుంటాడేమో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.