Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యాంగ్రీయంగ్ మన్ రాజశేఖర్ సుధీర్ఘ విరామం తర్వాత ‘గరుడవేగ’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. 25 కోట్ల బడ్జెట్‌తో రాజశేఖర్ సినిమాను నిర్మిస్తే అంతా కూడా నవ్వుకున్నారు. రాజశేఖర్‌పై 25 కోట్లు పెట్టిన నిర్మాత పెద్ద తెలివి తక్కువ వాడు అంటూ కొందరు మొహానే విమర్శలు చేశారు. కాని సినిమా సక్సెస్ అవ్వడంతో 25 కోట్లు రికవరీ అవ్వడంతో పాటు మంచి లాభాలు కూడా వచ్చాయి. ఒక వేళ సినిమా ఫలితం తారుమారు అయితే కనీసం అయిదు కోట్లు కూడా వసూళు కాకపోవు. హిట్ దక్కించుకున్న ఉత్సాహంతో రాజశేఖర్ ఉరకలేస్తున్నాడు.
రాజశేఖర్ తన తర్వాత సినిమాను సొంత బ్యానర్లో కాకుండా వేరే నిర్మాతకు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే రాజశేఖర్ చెబుతున్న బడ్జెట్‌కు నిర్మాతలు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఒక నిర్మాత రాజశేఖర్‌ను కలిసిన సమయంలో 20 కోట్లకు పైగా బడ్జెట్ పెడితేనే సినిమా చేస్తాను అంటూ ఖరాకండిగా చేప్పేశాడట. ఒక యువ దర్శకుడు స్క్రిప్ట్‌తో సిద్దంగా ఉన్నాడు. త్వరలోనే ఆయనతో సినిమాకు రాజశేఖర్ సిద్దం అవుతున్నాడు. అయితే 20 కోట్లు రాజశేఖర్‌పై పెట్టేందుకు మాత్రం నిర్మాతలు సాహసించడం లేదు. బయట నిర్మాతలు రాకుంటే మళ్లీ జీవిత నిర్మాణ బాధ్యతలు స్వీకరిస్తుందేమో చూడాలి. ‘గరుడవేగ’ సక్సెస్ అయ్యింది కాబట్టి 25 కోట్లు రికవరీ అయ్యింది. అన్ని సినిమాలు సక్సెస్ అవుతాయని భావిస్తే రాజశేఖర్ తప్పులో కాలేసినట్లే అని, 10 కోట్ల లోపు బడ్జెట్‌తో సినిమాు చేస్తేనే రాజశేఖర్ కెరీర్ మరి కొన్నాళ్లు సాగుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.