డబ్బు సంపాదించాలని అందరికీ ఉంటుంది. అయితే ఇది అందరి వల్ల కాదు. చాలా మందికి వారి సంపాదన నెలవారీ ఖర్చులు, ఈఎంఐలకే సరిపోతూ ఉంటుంది. అయితే కొంత మంది మాత్రం రూ.లక్షలు వెనకేస్తూ ఉంటారు. ఎలా అని అనుకుంటున్నారా? వారు ఎంచుకునే ఆదాయ మార్గం అలాంటిది. మనకు చాలా ఆప్షన్లు ఉంటాయి. అయితే ఎంచుకునే మార్గం ప్రాతిపదికన వచ్చే ఆదాయం ఆధారపడి ఉంటుంది.
ఆదాయ మార్గాల్లో స్టాక్ మార్కెట్ కూడా ఒకటి. షేర్ మార్కెట్ ద్వారా కూడా చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు. మీరు కూడా సంపాదించొచ్చు. అయితే రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు కనక వర్షం కురుస్తుంది. లేదంటే పెట్టిన డబ్బులు కూడా పోవచ్చు. స్టాక్ మార్కెట్లో చాలా రిస్క్ ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.
స్టాక్ మార్కెట్లో పలు మల్టీ బ్యాగర్ షేర్లు ఉంటాయి. వీటిల్లో బ్రైట్‌కామ్ గ్రూప్ షేరు కూడా ఒకటి. ఈ కంపెనీ షేరు గత ఏడాదిలో 2800 శాతం ర్యాలీ చేసింది. జనవరి 17న షేరు ధర రూ.190 వద్ద కదలాడుతోంది. అంతేకాకుండా ఈ కంపెనీ బోనస్ షేరు ఇష్యూ అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. వచ్చే బోర్డు మీటింగ్‌లో ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. బ్రైట్‌కామ్ గ్రూప్ షేరు ధర 2021 జనవరి 18న కేవలం రూ.6.48 మాత్రమే.
ఇప్పుడు షేరు ధర రూ.190కు చేరింది. అంటే ఏడాది కాలంలోనే షేరు ధర 2850 శాతం మేర ర్యాలీ చేసింది. మీరు ఏడాది కిందట ఈ షేరులో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే… ఇప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ విలువ ఏకంగా రూ.30 లక్షలు అయ్యి ఉండేది. ఇది మామూలు లాభం కాదండి. కళ్లుచెదిరే రాబడి అని చెప్పుకోవచ్చు.ఎందుకంటే మీరు లక్ష రూపాయలను అటు బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా.. లేదంటే స్మాల్ సేవింగ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసినా.. లేదంటే ఎవరికైనా అప్పుగా ఇచ్చిన ఇంతటి రాబడి మాత్రం రాదు.
అందుకే స్టాక్ మార్కెట్లో చాలా మంది భారీగా సంపాదిస్తూ ఉంటారు. అయితే చాలా మంది నష్టపోయిన వారు కూడా ఉన్నారు. కాగా ఈ షేరు ఆరు నెలల కాలంలో చూస్తే 470 శాతం రాబడి ఇచ్చింది. అంటే నెలల కిందట రూ.లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు రూ.6 లక్షలు వచ్చేవి.20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్స్క్రయిబ్ చేసుకోగలరు.