బ్యాంక్‌లోకి ప్రవేశించి ఓ సైకో వీరంగం సృష్టించాడు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వివరాలు.. శంషీర్‌గంజ్‌లోని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) లోకి గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సిక్‌చావునీకి అల్లావుద్దీన్(40) ప్రవేశించి ఒక్కసారిగా కేకలు వేస్తూ తనకు తాను బ్లేడ్‌తో గాయపరుచుకున్నాడు. ఒక చేతిలో బ్లేడ్, మరో చేతిలో రాయి పట్టుకొని బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాడు. సమాచారం అందుకున్న శాలిబండ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అల్లావుద్దీన్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.
పోలీసులను కూడా దగ్గర రానివ్వకుండా హంగామా సృష్టించాడు. చివరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు తరలించాడు. వారం రోజుల నుంచి ఇతడు వైట్నర్ సేవించి అలియాబాద్ ప్రధాన రహదారిపై తిరుగుతూ బ్లేడ్‌తో గాయం చేసుకోవడం, రోడ్డుపై బైఠాయించి న్యూసెన్స్ చేస్తున్నాడని ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పేర్కొన్నారు. బ్యాంక్‌లోకి కూడా తరచూ వస్తుండడంతో డబ్బులు విత్‌డ్రా చేసుకోవద్దని, అతడు లాక్కెలుతాడని ఏకంగా బ్యాంక్ అధికారులే తమకు సూచిస్తున్నారని ఖాతాదారులు వాపోయారు.