ప్రజాభిప్రాయం మేరకే పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సీఎం అభ్యర్థిని ప్రకటిస్తానని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు 24 గంటల తర్వాత, ప్రజలు అభ్యర్థిని ఎంచుకోవడానికి ఓ ఫోన్ నంబర్‌ను 70748 70748 ప్రారంభించారు. అనంతరం సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. సీఎం అభ్యర్థి ఎంపికకు పంజాబ్ ప్రజలు తమ ఎంపికను తెలియజేయడానికి కాల్/ మెసేజ్ లేదా వాట్సాప్ చేయాలని అన్నారు.
‘పంజాబ్‌లోని 3 కోట్ల మంది ప్రజల నిర్ణయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాము. జనవరి 17 సాయంత్రం 5 గంటలలోపు ప్రజలు తమ ఎంపికను తెలియజేయాలి. ప్రజల ఓటు ద్వాఆరా సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే పద్ధతిని ఉపయోగించడం ఇదే తొలిసారి’ అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.
పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్‌మాన్‌ను ఎంపిక చేస్తారని వస్తున్న ఊహాగానలపై కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు. ‘భగవంత్ మాన్ నాకు అత్యంత ప్రియమైన వ్యక్తి. తలుపులు మూసి నాలుగు గోడల మధ్య ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయవద్దని ఆయనే నాకు సూచించారు. సీఎం ఎంపిక కోసం ప్రజల్లోకి వెళ్లాలన్నది ఆయన ఆలోచనే అని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.