అభిమానులకి షాక్ ఇచ్చిన పునర్నవి

అభిమానులకి షాక్ ఇచ్చిన పునర్నవి

బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్‌, నటి పునర్నవి భూపాలం తన అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది. తన తాజా ఇన్‌స్టా పోస్టు చూస్తుంటే పునర్నవి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటో షేర్‌ చేస్తూ.. ‘చివరకు.. ఇది జరుగుతుంది’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసింది. ఈ ఫొటోలో పునర్నవి ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఆమె చేతిని పట్టుకుని ఉన్నాడు. అంతేగాక తన ఉంగరం వేలుకు డైమండ్‌ రింగ్‌ను కూడా ధరించి ఉంది. దీంతో తన పోస్టు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. పునర్నవి నిశ్చితార్థం జరిగిందని నెటిజన్‌లు ఫిక్స్‌ అయిపోతున్నారు. తన కాబోయే భర్తను చూపించాలంటూ నెటిజన్‌లు కామెంట్స్‌ పెడుతున్నారు.

అయితే తెలుగు బిగ్‌బాస్‌-3 సిజన్‌లో పునర్నవి కంటెస్టెంట్‌గా వచ్చిన విషయం తెలిసిందే. హౌజ్‌లో సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌, పునర్నవిలు సన్నిహితంగా మెదులుతూ జానాల్లో ఆసక్తిని పెంచారు. చెప్పాలంటే వారి మధ్య చిన్నపాటి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కూడా‌ నడిచింది. బయటకు వచ్చాక కూడా వీరిద్దరూ పలు టీవీ కార్యక్రమంలో జంటగా హాజరై ప్రేక్షకులను అలరించారు. దీంతో పునర్నవి, రాహుల్‌లను లవ్‌ బర్డ్స్‌గా ప్రేక్షకులు ఫిక్స్‌ అయిపోయారు. ఈ క్రమంలో వారిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న వీరిద్దరిని వారి రిలేషన్‌ గురించి అడగ్గా.. తాము స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు.