రొనాల్డోను వదలని కరోనా

రొనాల్డోను వదలని కరోనా

మేటి ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డోను కరోనా వదలడం లేదు. అతనికి మూడోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ కోవిడ్‌–19 పాజిటివ్‌గా తేలాడు. చాంపియన్స్‌ లీగ్‌లో యువెంటస్‌ (ఇటలీ) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఈ పోర్చుగల్‌ స్టార్‌ ఫార్వర్డ్‌కు మంగళవారం సాయంత్రం పరీక్షలు నిర్వహించగా అతనిలో ఇంకా వైరస్‌ లక్షణాలు ఉన్నాయని తేలింది.

దాంతో బుధవారం రాత్రి చాంపియన్స్‌ లీగ్‌ గ్రూప్‌ ‘జి’లో భాగంగా స్టార్‌ ప్లేయర్‌ లయెనల్‌ మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తోన్న బార్సిలోనా క్లబ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌కు రొనాల్డో దూరమయ్యాడు. రెండు వారాల క్రితం వైరస్‌ బారిన పడిన రొనాల్డో ప్రస్తుతం ఇటలీలో ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు.