కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటంతో ప్రజలను మరింత అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వాలు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటుంది. దేశంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కొన్ని ప్రాంతాల్లో ఆదేశాలనూ కొందరు ఆకతాయిలు ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వం చెప్పేది తమకు కాదన్నట్టుగా వ్యవహరిస్తూ ముప్పు మరింత పెరిగేలా చేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ చట్టం 2005ని అమలులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తుంది. ఈ చట్టంలో ప్రధానంగా సెక్షన్ 51నుంచి సెక్షన్60 వరకు వివిధ నేరాలు వాటి శిక్షల్ని నిర్వహించారు అధికారులు.
సెక్షన్ 51 – కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలే సరైన కారణం లేకుండా అతిక్రమించే వారికి ఏడాది జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం కూడా ఉంటున్నట్లు సమాచారం. నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా, ఆపద వాటిల్లే పరిస్థితి ఉత్పన్నమైనా సదరు వ్యక్తికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు.
సెక్షన్ 52 – ఉద్దేశ పూర్వకంగా తప్పుడు సమాచారమిచ్చి అధికారుల నుంచి ఏదైనా సాయం పొందినా ఏవైనా పనులు చేయించుకున్నా వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కొన్నిసార్లు జరిమానా, జైలు శిక్ష రెండూ విధించవచ్చని సమాచారం.
సెక్షన్ 53 – విపత్తును అరికట్టేందుకు ఉపయోగించే వస్తువులు లేదా నగదును ఎవరైనా దుర్వినియోగం చేసినా లేదా పాడుచేసినా అలాంటి వ్యక్తులకు రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సెక్షన్ 54 – ప్రజల్ని గందరగోళ పరిచేలా ఆందోళన కలిగించేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారికి గరిష్ఠంగా రెండేళ్ల వరకు జైలు శిక్ష జరిమానా లేదా రెండూ ఉంటాయి.
సెక్షన్ 55 – ప్రభుత్వ అధికారి ఏదైనా విభాగం ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలకూ ఆదేశించవచ్చు. తనకు తెలియ కుండానే ఆ తప్పు జరిగినట్టు నిరూపించే ఆధారాలు సమర్పిస్తే విచారణ నుంచి మినహాయింపు ఉండవచ్చని అధికారులు తెలియజేశారు.
సెక్షన్ 56 – విధి నిర్వహణలో విఫలమైన అనుమతి లేకుండా విధుల నుంచి తప్పుకున్నా ఈ చట్టం కింద ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలు అమలులో విఫలమైన లేదా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధుల నుంచి వైదొలిగిన గరిష్ఠంగా ఏడాది వరకు జైలు జరిమానా విధించే అవకాశం ఉంది.
సెక్షన్ 57 – సెక్షన్ 58 – విపత్తు నిర్వహణ చట్టం 2005 నిబంధనల్ని ఏదైనా కంపెనీ లేదా కార్పొరేట్ బాడీ ఉల్లంఘించినట్టు నిరూపితమైతే ఆ కంపెనీ డైరెక్టర్ లేదా మేనేజర్ ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందికి ఏడాది పాటు జైలు శిక్ష జరిమానా విధించనున్నట్లు సమాచారం.
సెక్షన్ 59 – సెక్షన్ 55,56ల కింద నమోదైన కేసుల ప్రాసిక్యూషన్ కు వినియోగిస్తారు.
సెక్షన్ 60 – ఈ చట్టం పరిధిలోని అంశాల్లో కోర్ట్ లు నేరుగా కలగజేసుకునే అవకాశం ఉండదు. ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తే పైన చెప్పిన సెక్షన్ల కింద శిక్షలు తప్పవని అధికారులు వెల్లడిస్తున్నారు.