సీఎం మేనల్లుడి అరెస్ట్‌

సీఎం మేనల్లుడి అరెస్ట్‌

పంజాబ్‌ ఎన్నికల్లో దగ్గరపడుతున్న వేళ సీఎం మేనల్లుడు అరెస్ట్‌ కావడం పట్ల రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. గురువారం ఇసుక అక్రమ తవ్వకాల కేసులో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ హనీను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్‌ చేసింది. సుమారు ఎనిమిది గంటల పాటు భూపీందర్‌ను విచారించిన ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం  కింద అరెస్టు చేశారు.

గత నెలలో ఈడీ అధికారులు పంజాబ్‌లోని మొహాలీ, లూథియానా, రూప్‌నగర్, ఫతేఘర్ సాహిబ్, పఠాన్‌కోట్‌లో భూపీందర్‌ సింగ్‌తో పాటు పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇసుక మైనింగ్ వ్యాపారం, ఆస్తుల లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లు, రూ. 21 లక్షల విలువైన బంగారం, రూ.12 లక్షల విలువైన రోలెక్స్ వాచ్‌తో పాటు రూ.10 కోట్ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఒకే ద‌శ‌లో ఫిబ్రవరి 20న జ‌ర‌గ‌నుండ‌గా.. మార్చి 10న ఫలితాలు వెలువడి కానున్నాయి.