మన ప్రస్తుత జీవిత కాలంలో మనుషులకి ముఖ్యంగా సోషల్ మీడియా కూడా భాగస్వామ్యంగా మారిపోయింది. అందుకు అనుగుణంగా ఎవరైనా కూడా సోషల్ మీడియా ని ఎవరికీ ఇష్టం వచినట్లు వారు వాడుకుంటున్నారు. ఎంతో మంది ప్రముఖులతో పాటు విద్యార్థులు, అనేకమంది ప్రజలు, ప్రతీ రంగానికి చెందిన వారందరు కూడా సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటూ, వారికీ సంబందించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నారు. కాగా ఇలాంటి నేపథ్యంలో కొందరు ప్రముఖుల పేర్లతో ఫేక్ అకౌంట్లను క్రీట్ చేస్తూ, అమ్మాయిలకు వల వేస్తూ, ఒకరకమైన పైశాచికానందాన్ని పొందుతున్నారు.
కాగా తాజాగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి పేరుతో ఒక ఆకతాయి యువకుడు ఒక ఫేక్ అకౌంట్ సృష్టించి చాలా మంది అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టాడు. కాగా నిజంగానే తమకు ఆకాష్ పూరి రిక్వెస్ట్ పెట్టాడని భ్రమపడ్డ కొందరు యువతులు అతడితో చాటింగ్ చేయడం మొదలెట్టారు. కానీ ఒకమ్మాయి మాత్రం తనతో చేసేది ఆకాష్ కాదని పసిగట్టిన ఒక యువతి, వాడికి బుద్ధి చెప్పాలని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ నిందితుడిని పట్టుకొని, అతడి నుండి హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్స్ స్వాధీనం చేసుకున్నారు.