దిగొచ్చిన పూరి జగన్నాథ్.. ‘లైగర్ ‘వివాదానికి పులిస్టాప్..

దిగొచ్చిన పూరి జగన్నాథ్.. 'లైగర్ 'వివాదానికి పులిస్టాప్
లైగర్ 'వివాధాం

టైగర్ మూవీ నష్టాలపై ఆ సినిమా ఎగ్జిబీటర్లు డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ పూరి జగన్నాధకు మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిజెక్ట్ అయినందుకు తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఎగ్జిబీటర్లు ధర్నాకు దిగారు. అయితే ఈ వ్యవహారాన్ని ఇప్పటిదాకా లైట్ తీసుకున్న పూరి, తాజాగా వారితో హామీ ఇవ్వడంతో వివాదం సెటిల్ అయినట్లు సమాచారం.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన లైగర్ లీగల్ బయ్యార్లు ఎగ్జిబిటర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. అయితే సినిమా అట్లర్ ప్లాప్ అయినందుకు తమ నష్టపరిహారం చెల్లించాలని ఏరియా ఎగ్జిబిటర్లకు పూరి నీ గతంలో కోరారు. అందుకు పూరి సైతం అంగీకరించాడు. కానీ ఆరు నెలలైనా స్పందించకపోవడంతో నైజాం ఎగ్జిబిటర్లు.. ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నిరసన దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే.

దిగొచ్చిన పూరి జగన్నాథ్.. 'లైగర్ 'వివాదానికి పులిస్టాప్
లైగర్ ‘వివాధాం

దీనిపై పూరి ఘాటుగా మాట్లాడిన వాయిస్ నోట్ కూడా నెట్టింట వైరల్ అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం పూరీ జగన్నాథ్ దిగొచ్చి.. పరిహారం చెల్లిస్తామని చెప్పడంతో వారు దీక్షలు విరమించారు. ఫిలిం చాంబర్ ఎదుట గత శుక్రవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టిన ఎగ్జిబిటర్లు గురువారం ధర్నా విరమించారు. చెల్లింపునకు సంబంధించి నిర్మాత మండలితో పాటు తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

లైగర్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య డైరెక్ట్ సంభాషణ లేనప్పటకీ ఫిల్మ్ ఛాంబర్ ఈ సమస్యను పరిష్కరించనుంది. ఈ మేరకు ప్రొడ్యూసర్ చార్మి.. ఫిల్మ్ ఛాంబర్‌తో టచ్‌లో ఉంది. త్వరలోనే డబ్బు చెల్లిస్తామని ఆమె చాంబర్‌కు మెయిల్ ద్వారా తెలియజేసింది. మొత్తానికి పూరి, చార్మి నుంచి స్పందన రావడంతోనే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు నిరసన నిలిపేశారు.