మహేష్‌25, పీవీపీ వివాదం ముగిసింది!

PVP's Entry Into Mahesh's babu 25th movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మహేష్‌బాబు 25వ చిత్రంను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌లు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. మొదట ఈ చిత్రం నిర్మాణ బాధ్యతను పీవీపీకి మహేష్‌బాబు అప్పగించాడు. అయితే ఏదో కారణం వల్ల ఆయన స్థానంలో దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌లు వచ్చి చేరారు. దర్శకుడు వంశీ పైడిపల్లికి అడ్వాన్స్‌ ఇచ్చి కథను తాను సిద్దం చేయించాను అని, ఇప్పుడు తనకు చెప్పకుండా, తాను రెడీ చేయించిన కథతో మరో నిర్మాతలతో కలిసి సినిమా చేస్తున్నాడు అంటూ పీవీపీ నిర్మాతల మండలిని ఆ తర్వాత కోర్టును ఆశ్రయించాడు. దాంతో మహేష్‌బాబు, వంశీల కాంబో మూవీ అసలు పట్టాలెక్కుతుందా అని అంతా భావించారు. ఈ సమయంలో మహేష్‌బాబు వివాదం సర్దుమనిగేలా ప్రయత్నాలు చేశాడు. పీవీపీతో మాట్లాడి కాంప్రమైజ్‌ చేసి ఫిర్యాదులను వెనక్కు తీసుకునేలా చేశాడు.

ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మాణంలో ‘బ్రహ్మోత్సవం’ను మహేష్‌బాబు చేశాడు. ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. దాంతో పీవీపీ బ్యానర్‌లో 2018లో మరో సినిమాను చేస్తానంటూ మహేష్‌ హామీ ఇచ్చాడు. ఆ హామీ మేరకు తన 25వ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నిర్మాతలు దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌లతో మాట్లాడి పీవీపీని కూడా ఆ ప్రాజెక్ట్‌లో నిర్మాతగా మహేష్‌ మార్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్‌బాబు ఈ చిత్రం కోసం సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభం కాబోతుంది. మహేష్‌బాబు 25వ సినిమాపై గత కొన్నాళ్లుగా నడుస్తున్న వివాదంకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లయ్యింది. ఈమద్య కాలంలో ఒక్క స్టార్‌ హీరో మూవీని ముగ్గురు పెద్ద నిర్మాతలు నిర్మించడం చాలా అరుదు. ఆ అరుదైన సంఘటన మహేష్‌బాబు 25వ సినిమాకు కనిపించబోతుంది.