పవన్ కి సొంత కులం వారే హ్యాండ్ ఇస్తారా ?

will kapu community supports pawan kalyan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ అందుకు తగ్గట్టుగానే జనసేన పోరాట యాత్ర పేరుతో జనాల్లోకి వెళుతున్నాడు. ముందు నుండి నాకు కులం లేదు మతం లేదు నన్ను ఒక కులానికి పరిమితం చెయ్యద్దు అని మీడియా ముఖంగా చెబుతున్నా పార్టీలో ఒక్క ఉపాధ్యక్ష్యుడు పదవి తప్ప మిగతా ముఖ్యమైన పదవులన్నీ తన సొంత సామాజిక వర్గం అయిన కాపు వర్గానికే పెద్ద పీట వేసి మరీ కట్టబెట్టి ఇది మన పార్టీ అని వారిలో భావన కలిగించే ప్రయత్నం చేశాడు. దీంతో 2014లో నన్ను నమ్మే మీకు వోట్లు వేసారు నేను లేకపోతే బాబు సిఎం అయ్యేవాడు కాదు అని పవన్ చెబుతుంటే పరోక్షంగా ఈసారి తమ వర్గం వారు తనకే వోట్లు వేస్తారని ఆయన వ్యూహం కావచ్చు.

కానీ గ్రౌండ్ రిపోర్ట్స్ మాత్రం పవన్ కి తీవ్ర నిరాశ కలిగించేలా ఉన్నాయని తెలుస్తోంది. విశ్లేషకుల విశ్లేషణల ప్రకారం సోషల్ మీడియాలో ఉండే కాపు యువత తప్ప 30 ఏళ్ళు దాటిన వారిలో చాలామంది పవన్ కళ్యాణ్ పై సానుకూలంగా లేరు, ఎందుకంటే ప్రజారాజ్యం రూపంలో కళ్ళ ముందు జరిగిన మోసాన్ని వాళ్ళు ఇంకా మరచిపోలేకపోతున్నారని ప్రజారాజ్యం కోసం సొంత ఆస్థులను వెచ్చించి ప్రచారం చేసిన ఎంతోమంది ఎలాంటి గుర్తింపు లేకుండా అనామకులుగా మిగిలిపోయారనే భాద వారు మరలా సొంత ఆస్థులను పణంగా పెట్టకుండా చేస్తోందని వారు అంటున్నారు.

అలానే వాళ్ళ ఆలోచనాతీరు కూడా మారుతోందట తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కాపు వ్యక్తి సి.యం. కాలేదు కాబట్టి గెలిపించుకుంటే మహ అయితే రాజ్యాధికారం వస్తుంది కాని దానివలన కాపు కమ్యూనిటీ మొత్తం బాగుపడటం జరగదు, ఒకవేళ అలా చేద్దామని అనుకున్నా మిగతా సామాజిక వర్గాల వారు ఉద్యమాలు చేసే అవకాసం ఉంది. ఇప్పుడు రాజ్యాధికారం లేకపోయినా బాబు చలవా అంటూ కాపు కార్పోరేషన్ ద్వారా వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతున్నాయి, చంద్రబాబు సీ.యం.గా ఉన్నా ఆయన సామాజిక వర్గానికి ఎక్కువ జరుగుతున్నాయా? మా సామాజిక వర్గానికి ఎక్కువ జరుగుతున్నాయా? అని వారి బేరీజు వేసుకుంటున్నారు అని వారు విశ్లేషిస్తున్నారు.

ప్రజారాజ్యం కొట్టిన దెబ్బతో చాలా మంది నాయకుల భవిష్యత్తు దెబ్బతిన్నదని పార్టీ మారకుంటే మంత్రి పదవుల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మిగిలిపోయారు, ఉదాహరణకి చూసుకోవాలంటే రామచంద్రాపురం ప్రస్తుత ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, నియోజకవర్గంలో తిరుగులేని మాస్ లీడర్, ఈయన ప్రభావం పక్కనున్న 3,4 నియోజకవర్గాల్లో కూడా ఉంటుంది.. నాలుగుసార్లు ఎమ్మెల్యే.. కానీ మంత్రి పదవి ఆయన్ని కాదని మొదట సారి ఎమ్మెల్యే అయిన చినరాజప్పకి హోం సహా డిప్యూటీ సిఎం అయిపోయాడు కారణం ఆయన పార్టీ మారలేదు కానీ త్రిమూర్తులు పార్టీ మారి వెనక్కి వచ్చాడని అందుకే ఆయన ఎమ్మెల్యేగానే ఉండిపోయాడు అనే వాదనను విశ్లేషకులు తెరమీదకు తెస్తున్నారు. అయితే ఇంకా ఏడాది ఉండటంతో ఇప్పటి లెక్క ఎన్నికల నాటికి ఉంటుందో తారుమారు అవుతుందో తెలియని పరిస్థితి. ఏది ఏమయినా చిరంజీవి ఉదంతంతో పవన్ ని మళ్ళీ తమ భుజాలా మీద మోసేందుకు ఆ సామాజిక వర్గం వారు లేదనేది అర్ధం అవుతోంది.