చరణ్‌ చక్కని నిర్ణయం… అందరు ఫాలో అవ్వాలి

Ram Charan says i will not paste movie collection details on Posters

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌ స్టార్‌ హీరోల మద్య గతంతో పోల్చితే ప్రస్తుతం మంచి వాతావరణం నెలకొంది. స్టార్‌ హీరోలు అంతా కూడా కలిసి మెలిసి ఉంటున్నారు. ఒకరి సినిమా గురించి ఒకరు, ఒకరి ప్రాజెక్ట్‌ గురించి మరొకరు చర్చించుకుంటూ ఉంటున్నారు. ముఖ్యంగా చరణ్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌లు మంచి స్నేహంతో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి సమయంలో ఫ్యాన్స్‌ మరియు నిర్మాతలు వీరి మద్య విభేదాలు పెట్టేలా కొన్ని పనులు చేస్తున్నారు. హీరో రికార్డుల పేరుతో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ఇకపై రికార్డుల ప్రకటన చేయవద్దని రామ్‌ చరణ్‌ చక్కని నిర్ణయం తీసుకుని అందరికి ఆదర్శప్రాయంగా నిలిచాడు.

తాజాగా ఒక మొబైల్‌ స్టోర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైన సందర్బంగా మీడియా సమావేశంలో పాల్గొన్న రామ్‌ చరణ్‌ ఇకపై తాను చేసే ప్రతి సినిమాకు సంబంధించిన పోస్టర్స్‌పై నెంబర్స్‌ కనిపించవు అన్నాడు. అంటే ఎంత వసూళ్లు చేసింది, ఏ ఏరియాలో ఎంత వసూళ్లు అయ్యింది అనే లెక్కలు పోస్టర్స్‌పై వేయవద్దని నిర్మాతలకు సూచిస్తాను అంటూ రామ్‌ చరణ్‌ హామీ ఇచ్చాడు. తాను నటించిన సినిమాను ఎంతమంది ప్రేక్షకులు చూశారు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటాను తప్ప, తన సినిమా ఎంత వసూళ్లు చేసిందనే విషయాన్ని పట్టించుకోను అంటూ రామ్‌ చరణ్‌ చెప్పుకొచ్చాడు. చరణ్‌ మాదిరిగానే అందరు హీరోలు కూడా ఉంటే బాగుంటుందని, పోటీ లేకుండా ఒకరికి ఒకరు ప్రోత్సాహకంను అందించుకుంటూ ముందుకు వెళ్లాలి అంటూ సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. రామ్‌ చరణ్‌ దారిలో ఎంతమంది తెలుగు హీరోలు నడుస్తారో చూడాలి.