దేశమంతా కరోనా మహమ్మారిపై పోరాడుతుంది. దీంతో రైల్వే శాఖ కూడా తాను కూడా రెడీ అంటూ ముందడుగు వేసింది. బాధితులకు సేవలు అందించేందుకు తిరుపతిలో క్వారెంటైన్ ట్రెయిన్ సిద్ధమవుతోంది. అరవై కోచ్ లతో రైలు సిద్ధం చేసిన రైల్వేశాఖ కరోనా రోగుల సంఖ్య పెరిగితే రాయలసీమలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా మాహమ్మారిని అరికట్టెందుకు అధికారులు పనులు చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. కరోనా పాజిటివ్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. దీంతో అన్ని ప్రభుత్వ శాఖలు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నాయి.
అదేవిధంగా చాలా వరకు క్వారెంటైన్ సెంటర్లను పెంచే పనిలో ప్రభుత్వం ఉంటే రైల్వే శాఖ కూడా అందుకు తాను చేయూతను అందిస్తానని తెలిపింది. అలాగే.. తిరుపతిలో క్వారెంటైన్ కేంద్రంగా ఒక ట్రైన్ నే మార్చేశారు రేల్వే అధికారులు. స్లీపర్ కోచ్ లల్లో ఉండే బాత్ రూంలో ఒక బాత్రూమ్ ని స్నానాల గదిగా షవర్లను కూడా ఏర్పాటు చేశారు. మరొక బాత్రూమ్ ని మరుగు దొడ్డిగా… మార్చేశారు రేల్వే సిబ్బంది. స్లీపర్ బర్త్ లో ఉండే సీట్లలోని మధ్య సీటును తొలగించటమే కాక అన్ని కిటికీలకు మెష్ ని ఏర్పాటు చేశారు అధికారులు. అంతేకాకుండా.. బాధితులకు దోమల బెడద లేకుండ ఉండేలా..
వెంటిలేటర్లకు అణువుగా ఉండేలా వెల్డింగ్ వర్క్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కేవలం బాధితులు మాత్రమే కాకుండా అనుమానం ఉన్న బాధితులు కూడా ఉండేలా తగిన ఏర్పాట్లు చేస్తుంది రైల్వేశాఖ. కాగా ఈ ట్రైయిన్ ని ఏ ప్రాంతాలకు కావాలంటే ఆ ప్రాంతాలకు ఒక ఇంజెన్ ను తగిలించి ఈ బోగీలను పంపేందుకు రేల్వే రంగం సిద్ధం చేస్తొది.