త్రివిక్రమ్‌కు ఖరీదైన గిఫ్ట్‌

Radha Krishna Expensive Gift To Trivikram

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు నిర్మాత రాధాకృష్ణకు ఎక్కడ, ఎలా కలిసింద కాని వీరిద్దరి కలయికలో వరుసగా సినిమాలు వస్తున్నాయి. రాధాకృష్ణ బ్యానర్‌లో తప్ప మరెవ్వరి బ్యానర్‌లో కూడా త్రివిక్రమ్‌ సినిమాలు చేయడం లేదు. త్రివిక్రమ్‌ కోరినంత పారితోషికం ఇచ్చి, అడిగినంత షేర్‌ను ఇచ్చేందుకు నిర్మాతలు క్యూలో ఉంటారు. కాని ఆయన మాత్రం కేవలం రాధాకృష్ణ నిర్మాణంలోనే సినిమాలు చేస్తున్నాడు. అందుకే సినిమా పరిశ్రమలో వీరిద్దరి మద్య ఉన్న సంబంధం ఉంటా అంటూ చర్చ జరుగుతుంది. త్రివిక్రమ్‌కు ఒక్కరు నచ్చితే వారితోనే ట్రావెల్‌ అవుతూ వస్తాడు. నిర్మాత రాధాకృష్ణపై త్రివిక్రమ్‌కు మంచి అభిప్రాయం ఏర్పడినది. ఆ కారణంగానే వరుసగా ఆయన బ్యానర్‌లో సినిమాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

నిర్మాత రాధాకృష్ణ కూడా త్రివిక్రమ్‌తో సినిమా అంటే బడ్జెట్‌ గురించి ఆలోచించకుండా పూర్తి స్వేచ్చను ఆయనకే ఇచ్చేస్తాడు. ఆయన కోరిన పారితోషికం ఇవ్వడంతో పాటు, ఆయన చెప్పినట్లుగా చేసేందుకు ముందుకు వస్తాడు. ఆ మద్య అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో త్రివిక్రమ్‌, పవన్‌ల దారిలో నిర్మాత రాధాకృష్ణ కూడా డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం చెల్లించాడు. ఇలా త్రివిక్రమ్‌కు సినిమా సినిమాకు రాధాకృష్ణ సన్నిహితుడు అవుతున్నాడు. తాజాగా త్రివిక్రమ్‌కు నిర్మాత రాధాకృష్ణ 3.65 కోట్లు పెట్టి రేంజ్‌ రోవర్‌ కారును కొనుగోలు చేసి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్‌ ఈ గిఫ్ట్‌ను అందుకున్నాడు. ఖచ్చితంగా ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమా సక్సెస్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో నిర్మాత ఇంత భారీ మొత్తంలో ఖరీదైన బహుమతిని అందించినట్లుగా తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఇలాంటి ఖరీదైన గిఫ్ట్‌లు కామన్‌. కాని మరీ ఇంత ఖరీదైన గిఫ్ట్‌లు చాలా అరుదుగా చూస్తూ ఉంటామని సినీ వర్గాల వారు అంటున్నారు.