Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్టేషన్ హౌస్ అధికారి పక్కన చేతులు జోడించి నిల్చుని ఉండగా… ఆయన సీటులో దర్జాగా రాధే మా కూర్చున్న ఫొటో ఒకటి నిన్న చానళ్లలోనూ, సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేసింది. ఓ ఫొటో గ్రాఫర్ ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రాధే మాను వీవీఐపీలా గౌరవించిన పోలీసులు అని కామెంట్ చేశాడు. వెంటనే ఈ ఫొటో వైరల్ అయింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అయితే మెడలో ఎర్ర శాలువాతో రాధే మా పక్కన వినమ్రంగా నిల్చున్న ఢిల్లీ వివేక్ విహార్ పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి సంజయ్ శర్మ ఆ ఫొటోపై వివరణ ఇచ్చాడు. రాధే మా బాత్ రూం కు వెళ్లేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చారని, అనంతరం తన సీట్లో కూర్చున్న ఆమెను… తాను చేతులు జోడించి లేవాల్సిందిగా అభ్యర్థించానని చెప్పాడు.
ఇప్పుడు రాధే మా కూడా మీడియాకు అదే చెబుతోంది. వాష్ రూం కోసమే తాను పోలీస్ స్టేషన్ కు వెళ్లానని, అక్కడ కుర్చీ ఖాళీగా ఉంటే కూర్చున్నానని, అది ఎస్ హెచ్ ఓ సీటని తనకు తెలియదని రాధే మా చెప్పింది. తనను చూసిన ఆ అధికారి కుర్చీలోనుంచి లేవాల్సిందిగా చేతులు జోడించి కోరాడని, వెంటనే తాను ఆ సీటు ఖాళీ చేశానని.. ఆమె అచ్చంగా సంజయ్ శర్మ చెప్పిందే వల్లెవేసింది. ఢిల్లీ పోలీసులను అవమానించే ఉద్దేశం తనకు లేదని సమర్థించుకుంది.