పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీలో రిలీజవబోతుందంటూ గత కొంతకాలంగా రూమర్లు చక్కర్లు కొడుతుండగా అందులో నిజం లేదని కొట్టిపారేశారు మేకర్స్. దీంతో ఈ సినిమా థియేటర్లలోనే మొదట రిలీజవబోతుందని ఫుల్ హ్యాపీగా ఫీలైన ఫ్యాన్స్ ప్రభాస్‌ను ఎప్పుడెప్పుడు స్క్రీన్‌పై చూస్తామా? ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో రాధేశ్యామ్ మార్చి 11న విడుదల కానుందంటూ అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. ‘లవ్, డెస్టినీకి మధ్య జరిగే యుద్ధాన్ని మార్చి 11న వీక్షించండి’ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. కాగా పెద్ద సినిమాలన్నీ రిలీజ్ డేట్ ప్రకటించేయడంతో రాధేశ్యామ్ కూడా డేట్ అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇటలీ నేపథ్యంలో పీరియాడిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన రాధేశ్యామ్‌ను సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.
రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేశారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్‌కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు.
ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదే తొలిసారి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి వర్క్ అదనపు ఆకర్షణగా నిలిచింది.