ఆకట్టుకుంటున్న ‘బిజినెస్ మేన్’ నుండి ‘రేజ్ ఆఫ్ సూర్య’ లిరికల్ సాంగ్..?

Superstar Mahesh Babu
Superstar Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ ల కలయికలో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ బిజినెస్ మేన్. 2012లో రిలీజ్ అయి అప్పట్లో అతి పెద్ద విజయం సొంతం చేసుకున్న బిజినెస్ మేన్ ని రేపు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా గ్రాండ్ లెవెల్లో థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ మూవీ యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ అదరగొడుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుండగా కొద్దిసేపటి క్రితం బిజినెస్ మేన్ నుండి రేజ్ ఆఫ్ సూర్య లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసారు. మూవీలోని పవర్ఫుల్ క్లిప్స్ తో పాటు ఆకట్టుకునే బీజీఎమ్ తో ఈ లిరికల్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో అందరినీ ఆకట్టుకుంటోంది. మరి బిజినెస్ మేన్ మూవీ రీ రిలీజ్ లో మొత్తంగా ఎంతమేర కలెక్షన్ కొల్లగొడుతుందో చూడాలి.