అతి త్వరలో కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో రాహుల్ గాంధీ
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాద్యతలు చేపట్టడానికి సర్వం సిద్ధమయింది. కొన్ని రోజులు నుంచి వార్తలొస్తున్నట్టుగా…గుజ రాత్ ఎన్నికల ముందే రాహుల్ కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించనున్నారు. సోమవారం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఆమోదించనున్నారు. సోనియాగాంధీ నివాసమైన 10 జన్ పథ్ లో ఈ సమావేశం జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ ను సీడబ్ల్యూసీ ఆమోదించగానే…పార్టీ కేంద్ర ఎన్నికల విభాగం నోటిఫికేషన్ జారీచేస్తుంది.
అధ్యక్ష ఎన్నికకు రాహుల్ గాంధీ ఒక్కరే పోటీపడనుండడంతో…ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీకి అప్పగించాలని కొంతకాలంగా పార్టీలో డిమాండ్ వినిపిస్తోంది. ఇటీవల సోనియాగాంధీ కూడా దీని గురించి పరోక్షంగా మాట్లాడారు. చాలా కాలంగా అందరూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి గురించి తనను అడుగుతున్నారని, ఇక అదే జరగనుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈసీ నిబంధనల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలను డిసెంబరు 31లోపు పూర్తిచేయాల్సి ఉంది. డిసెంబరు 9 నుంచి గుజరాత్ ఎన్నికలు ప్రారంభం కానుండడంతో …ఆ లోపే అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ పూర్తిచేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.