ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయం లో ఇంకా సందిగ్దత కొనసాగుతూనే ఉంది. మూడు రాజధానుల ప్రకటన చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బిల్లు ని అసెంబ్లీ లో ప్రవేశ పెట్టగ, దానిని సెలెక్ట్ కమిటీకి చేరేలా చేసారు శాసన మండలి చైర్మన్ షరీఫ్. అయితే ఈ ప్రక్రియకు కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నది. అయితే రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అక్కడి రైతులు, ప్రజలు నిరసనలు, దీక్షలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
అయితే అమరావతి ప్రాంత రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమరావతి రానున్నట్లు తెలుస్తుంది. అమరావతి రైతులకు మద్దతుగా ఒక్క రోజు దీక్షలో పాల్గొననున్నారని సమాచారం. అయితే దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. కర్నూల్ రాజధాని కి మద్దతు తెలుపుతూనే నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అందరికి తెల్సిందే. మరి ఈ చోటకు రాహుల్ గాంధీ వచ్చినా పరిస్థితుల్లో మార్పు వస్తుందా? అంటే కష్టమని చెప్పాలి.