Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాహుల్ గాంధీ రోజురోజుకీ రాజకీయంగా పరిణతి పెంచుకుంటున్నారు. బద్ధశత్రువైన బీజేపీ పార్టీ అగ్రనేతతో ఆయన మాట్లాడటం కాంగ్రెస్ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. ఉన్నట్లుండి సభలో అద్వానీ సీటు దగ్గరకు వెళ్లిన రాహుల్.. వంగి మరీ ఆయనతో ఐధు నిమిషాలు మాట్లాడారు. ఇంతకూ అద్వానీకి రాహుల్ చెప్పిందేంటనేది ఆసక్తికరంగా మారింది. కొన్నాళ్లుగా అద్వానీకి బీజేపీలో విలువ లేకుండా పోతోంది. పీఎం చేయకపోయినా కనీసం రాష్ట్రపతి అవ్వాలన్న పెద్దాయన కోరిక తీరనేలేదు. దీనికి తోడు శిష్యుడైన మోడీ ఎప్పుడో మూతపడ్డ బాబ్రీ కేసును మళ్లీ తెరిపించి ఈ వయసులో గురువున కష్టపెడుతున్నారు. కనీసం కీలక సమయాల్లో కూడా ఆయన అభిప్రాయం తెలుసుకోకుండా పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారు.ఇట్లాంటి సమయంలో రాహుల్ తెలివిగానే అద్వానీతో మాట్లాడారని కాంగ్రెస్ అంటోంది. మిమ్మల్ని మోడీ పట్టించుకోకపోయినా.. మేమున్నామనే సంకేతాలు పంపారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఈ వయసులో అద్వానీతో ఒరిగేదేమీ లేదు. ఆ సంగతి రాహుల్ కూ తెలుసు. కాకపోతే మైండ్ గేమ్ ఆడి ప్రధానిపై ఒత్తిడి పెంచాలనేదే అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది.
మరిన్ని వార్తలు