Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో రాహుల్ గాంధీ ఒకరని చెప్పవచ్చు. కానీ ఆయన వయసు ఇప్పుడు సుమారు హాఫ్ సెంచరీకి దగ్గరిలో ఉంది. ఆయన పెళ్లి మీద గతంలో ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. ఆయనకీ విదేశాల్లో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అందుకే ఆయన విదేశీయానం ఎక్కువ చేస్తుంటారు అని ఇలా రకరకాల వార్తలు వచ్చేవి. ఇక ఆ మధ్య ఒక దళిత మహిళా చేసుకుంటే రాహుల్ నే చేసుకుంటా అని లేదంటే ఇక్కడే చచ్చిపోతా అని జనపద్ ముందు నిరాహారదీక్షకి సైతం దిగింది. ఎప్పుడు పెళ్లి ప్రస్తావన వచ్చినా రాహుల్ దాటవేస్తుంటారు. అలాగే ఆయన మీద వచ్చిన పుకార్లని ఖండిస్తూ ఉంటారు. ప్రతిసారీ కొత్త పేర్లు రావడం ఆ తర్వాత దాన్ని ఖండించడం జరుగుతోంది.
తాజాగా మరో సారి రాహుల్ కు ఈ నెలలోనే వివాహం జరగనుందని, రాయ్ బరేలీ ఎమ్మెల్యే అదితి సింగ్ ను ఆయన పెళ్లి చేసుకొనున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. దేశ రాజకీయ వర్గాల్లో మోడీ తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న నేత కావడం వాళ్ళ అది వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు కర్నాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ కి విషయం తెలిసిందో లేదో కాని ఆయనైతే స్పందించలేదు. దీంతో ఇక లాభం లేదనుకున్న సదరు రాయ్ బరేలీ ఎమ్మెల్యే స్పందించారు. తనకు రాహుల్ పెద్దన్న లాంటి వాడని అలాంటి అన్నాచెల్లెళ్ల మధ్య వివాహం జరుగుతోందని ప్రచారం చేయడం మంచిది కాదని కర్నాటక లో రామ పార్టీ కి పెరుగుతున్న విశేష ఆదరణ చూసి ఇలా చవకబారు ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే అతిది సింగ్ ప్రకటించింది.
ఈ వార్తలో ఎటువంటి నిజమూ లేదని, తన చేత్తో రాఖీ కట్టిన రాహుల్ గాంధీ, తనకు అన్నయ్యని, ఈ పుకార్లతో తాను చాలా బాధపడ్డానని ఎమ్మెల్ల్యే తెలిపారు. రాయ్ బరేలీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అఖిలేష్ సింగ్ కుమార్తె అతిది సింగ్. ఇప్పుడామె వయసు 29 సంవత్సరాలు. యూఎస్ లోని డ్యూక్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. గత ఎన్నికల్లో 90 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచింది. ప్రియాంకా గాంధీకి అదితి సన్నిహితురాలు కావడంవల్లే ఆమెకు, రాహుల్ కు ఆమెతో వివాహమంటూ పుకార్లు వచ్చాయి. తొలుత రాయ్ బరేలీలోని వాట్స్ యాప్ గ్రూపుల నుంచి ఈ పుకార్లు ప్రారంభం అయ్యాయి. మిగతా ప్రాంతాలకు విస్తరించాయి.