మోడీ అచ్చాదిన్ : రైల్వే ప్రయాణికుల మీద బాదుడుకు సిద్దం

rail passengers to pay six-time penalty for carrying excess luggage

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అచ్చాదిన్‌ వచ్చేస్తాయని, ఉద్యోగాలు, సంపద సృష్టిస్తానని 2014 ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసి కేంద్రంలో ప్రధాని మంత్రి పదవి పొందిన నరేంద్రమోదీ ఈ నాలుగేళ్ల పాలనలో ఏమీ సాధించలేదు. నోట్ల రద్దు చేసి సామాన్యుల కడుపులు కొన్నాళ్ళ పాటు కాలేలా చేయడం తప్ప, ఏదో చేస్తారని అధికారం కట్టబెట్టిన ప్రజల్లో ఆయన భ్రమలు తొలగుతున్నాయి. అందుకే బీహార్‌ మొదలు మొన్నటి కర్నాటక ఎన్నికల వరకు మోడీకి గుణపాఠం చెప్పారు. లోక్ సభ లో నిన్నమొన్నటి దాకా సరిపడా సంఖ్యా బలం ఉండటంతో కళ్ళు నెత్తికెక్కిన మోడీ అండ్ కో కి ఇప్పుడిప్పుడే వాస్తవాలు బోధపడుతున్నాయి. అందుకే తమను వద్దని వెళ్ళిపోయిన మిత్రపక్షాలను బుజ్జగించే పనిలో పడ్డారు.

మొన్నటికి మొన్న గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యుల ఆగ్రహానికి గురవుతున్నా మోడీ సర్కారుకు చీమకుట్టినట్టు అయినా అనిపించడంలేదు. అందుకే ఇప్పుడు ఇక రైల్వే మీద పడ్డారు. 30 ఏళ్లుగా అమలవుతున్న లగేజీ చార్జెస్ ను సడలించి వాటి స్థానంలో కొత్త నిబంధన అమలపరుస్తోంది. ఇప్పటికే అమలులో ఉన్న నిబంధనలు సడలించి మరింత స్ట్రిక్ట్ గా అమలుపరచబోతోంది. ఇప్పటివరకు ఎలా అయినా కానివ్వండి ఇక మీదట రైల్వే సూచించిన నిబంధనల ప్రకారం, స్లీపర్ క్లాస్ ప్రయాణీకులు 40 , సెకండ్ క్లాస్ ప్రయాణీకులు 30 కిలోల బరువుగల లగేజీని ఉచితంగానే తీసుకెళ్లవచ్చు.

ఒకవేళ అంతకుమించితే స్లీపర్ క్లాస్ ప్రయాణికుల లగేజి 80 కేజీలు, సెకండ్ క్లాస్ ప్రయాణీకులు 70 కిలోల వరకు టికెట్ తోపాటు అదనపు ఛార్జీ పే.. చేయాల్సి ఉంటుంది. ఇవి కూడా రైలు వెనుక ఉండే లగేజీ వ్యానులో పెట్టాలని చెబుతోంది. ఇలా కాకుండా అనుమతిలేకుండా పరిమిత బరువుకంటే ఎక్కువ క్యారీ చేసినవారు తగిన మూల్యం చెల్లించుకోవలసిందే. అటువంటివారికి సాధారణంగా విధించే చార్జెస్ కంటే ఆరురేట్లు ఫైన్ విధించబడుతోందని డైరెక్టర్ అఫ్ ఇన్ఫర్మేషన్ మరియు పబ్లిసిటీ , రైల్వే బోర్డు అధికారి ప్రకాష్ వెల్లడించారు.
ప్రయాణం లగేజ్‌ పరిమితి(కేజీలలో) ఎక్స్ట్రా చార్జ్ తో లగేజ్‌ పరిమితి(కేజీలలో)
స్లిపర్‌ క్లాస్‌ 40 80
సెకండ్‌ క్లాస్‌ 35 70
ఏసీ టూ టైర్‌ 50 100
ఏసీ ఫస్ట్‌ క్లాస్‌ 70 150