బాబు తెగింపు వెనుక భారీ స్కామ్ ? 

Chandrababu warns PM Modi, Amit Shah against 'hatching grand conspiracies'

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ వ్యవహారశైలి ఎప్పటినుంచో చూస్తున్న వారికి కూడా ఈ మధ్య ఆయన దూకుడు వెనుక రహస్యం అంతుబట్టడం లేదు. ఆది నుంచి ఆవేశం కన్నా ఆలోచనకు , వ్యూహాలకు ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబు ఇప్పుడు మోడీ సర్కార్ మీద పోరాటానికి దిగడం చూసి వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఓ వైపు మోడీ ని చూసి దేశమంతా భయపడుతోంది , ఇంకో వైపు బీజేపీ కి చెందిన చోటామోటా నాయకులు సైతం చంద్రబాబు పనిపడతాం అని హెచ్చరికలు చేస్తున్నారు. అయినా బాబు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడం లేదు. ప్రధాని మోడీ ని టార్గెట్ చేస్తూ ఒక్క చంద్రబాబు మాత్రమే కాదు చినబాబు లోకేష్ కూడా ట్వీట్ అస్త్రాలు సంధిస్తూనే వున్నారు. ఈ తండ్రీ కొడుకుల తెగింపు వెనుక వున్న రహస్యం ఏంటో ఇప్పటిదాకా ఎవరికీ అంతు పట్టలేదు. తాజాగా అమరావతిలో జరిగిన ఓ ప్రెస్ మీట్ తో బాబు దగ్గర వున్న ఆ రహస్య ఆయుధం ఏంటో చూచాయగా తెలిసిపోయింది.
ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు కుటుంబరావు ప్రెస్ మీట్ అనగానే అగ్రి గోల్డ్ సహా ఏదో ఆర్ధిక అంశాలు , కేంద్రం ఇవ్వాల్సిన నిధులు గురించి మాట్లాడుతారు అనుకున్నారు అక్కడికి వెళ్లిన విలేకరులు కూడా. వారు అనుకున్నట్టే సాగింది కొద్దిసేపు ప్రెస్ మీట్. అయితే హఠాత్తుగా మధ్యలో కుటుంబరావు మోడీ సర్కార్ గుండెలు దద్దరిల్లే బాంబు పేల్చారు. కేంద్రం చేసిన రెండు భారీ కుంభకోణాలు ఓ నెల రోజుల్లో సాక్ష్యాలతో సహా బయటపెట్టబోతున్నట్టు చెప్పడమే కాదు …మార్క్ మై వర్డ్స్ అంటూ కేంద్రాన్ని హెచ్చరించారు. మోడీ , అమిత్ షా వ్యూహాలు , ఎదురు దాడి మంత్రాలు గమనించిన చంద్రబాబు ముందస్తుగా కేంద్ర ప్రభుత్వ తప్పిదాలకు సంబంధించి రెండు భారీ స్కామ్స్ వివరాల్ని రాబట్టినట్టు తెలుస్తోంది. అవి పక్కాగా చేతికి అందాకే కేంద్రానికి గుడ్ బై కొట్టే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
కుటుంబరావు ప్రెస్ మీట్ పెట్టిన కొద్దిసేపటికే ఢిల్లీ లో బీజేపీ పెద్దలకు విషయం నివేదించారట రాష్ట్ర కాషాయ నేతలు. ఏ కుంభకోణం గురించి బాబు బాంబు పేలుస్తాడో అర్ధం చేసుకున్న మోడీ , షా ఇప్పుడు తెగ గింజుకుంటున్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఓ ప్రజాకర్షక పధకం ప్రకటించి 2019 ఎన్నికలకు ప్రజల్ని మచ్చిక చేసుకుందాం అని ప్లాన్ చేసుకుంటున్న గుజరాతీ ద్వయానికి బాబు వ్యూహం ఓ షాక్ అనిపిస్తోంది. కుటుంబరావు చెప్పినట్టు ఆ రెండు కుంభకోణాలు సాక్ష్యాలతో సహా బయటకు వస్తే వచ్చే లోక్ సభ సమావేశాల్లో మోడీ సర్కార్ విపక్షాల నుంచి తీవ్ర ప్రతి ఘటన ఎదుర్కోవడం ఖాయం. అయితే ఇదంతా అంచనా వేయలేకుండా చంద్రబాబుని ఓ సామాన్య రాజకీయ నాయకుడిలా చూసి అవమాన పరిచిన మోడీ , షా లు ఇప్పుడు తాము ఎంత పెద్ద తప్పు చేసామో అర్ధం చేసుకుని తలపులు వేసుకుని మరీ నెత్తినోరు బాదుకుంటున్నారట.