హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ ఈసీఐఎల్ సమీపంలోని సాకేత్ కాలనీ కాప్రా ప్రాంతంలో గాలివాన ధాటికి చెట్లు కొమ్మలు విరిగి పోయాయి. అలాగే.. విద్యుత్ స్థంబాలు రోడ్డుపై విరిగిపడిపోయాయి.
ఒక్కసారిగా వాతావరణం మారిపోయిన గాలివాన బీభత్సం సృష్టించింది. గాలికి చెట్లు విరిగి పడటంతో ఏం జరుగుతుందో అని కాలనీ వాసులు భయానికి లోనయ్యారు. చెట్ల కొమ్మలు విరిగి రోడ్డుమీద అడ్డంగా పడి ఉన్నాయి. అయితే ఓ మోస్తారుగా వర్షం పడి ఆగిపోయింది.
దీంతో కాలనీ వాసులంతా రోడ్లమీదకు వచ్చి విరిగి పడి ఉన్న చెట్ల వద్ద గుమికూడారు. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ కూడా తీసివేయడంతో జనాలు బయటకు వచ్చారు.