అఖిల్‌తో ‘హలో’ చెప్పబోతున్న రాజ్‌ తరుణ్‌…

Raj Tarun Guest Role In Akhil Hello Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ ‘హలో’ చిత్రం విడుదలకు ముస్తాబయ్యింది. క్రిస్మస్‌ కానుకగా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నాగార్జున ఈ చిత్రాన్ని దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రంలో సమంత మరియు అమలలు గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు నాగచైతన్య కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తాడు అంటూ సినీ వర్గాల నుండి పుకార్లు వినిపించాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వారు ఎవరు కూడా ‘హలో’ చెప్పబోవడం లేదు అని తేలిపోయింది.

తాజాగా అఖిల్‌తో ‘హలో’ను రాజ్‌ తరుణ్‌ చెప్పబోతున్నట్లుగా సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ‘హలో’ చిత్రంలో ఒక చిన్న పాత్రలో రాజ్‌ తరుణ్‌ కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. రాజ్‌ తరుణ్‌ మొదటి సినిమాకు నిర్మాత నాగార్జున అనే విషయం తెల్సిందే. ఆ విశ్వాసంతో నాగార్జున అడిగిన వెంటనే రాజ్‌ తరుణ్‌ ‘హలో’ చిత్రంలో గెస్ట్‌ రోల్‌ను చేసేందుకు కమిట్‌ అయ్యాడు. త్వరలోనే రాజ్‌ తరుణ్‌ రోల్‌ ఏంటీ అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అఖిల్‌ ఫుల్‌ బిజీగా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.

అఖిల్‌కు జోడీగా ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శిణి హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. రాజ్‌ తరుణ్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతుండగా నాగార్జున ఈ చిత్రం కోసం వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. ఒక విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ తెరకెక్కించాడు. అఖిల్‌ మొదటి సినిమా నిరాశ పర్చినా కూడా ఈ రెండవ చిత్రం ఖచ్చితంగా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను అక్కినేని ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు.