ఇప్పుడెలా ‘జబర్దస్త్‌’లో రోజా..!

Pawan fans fires on roja about pawan kalyan comments

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వైకాపా ఎమ్మెల్యే రోజా గత కొన్ని రోజులుగా జనసేనాని పవన్‌ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. వారసత్వం గురించి జగన్‌ను ప్రశ్నించిన పవన్‌పై వాడు వీడు అంటూ రోజా కామెంట్స్‌ చేయడం జరిగింది. ఆ విషయం మర్చి పోక ముందే పవన్‌కు తెలుగు దేశం నాయకులు గుండు కొట్టించిన విషయం నిజమే అని, ఆ సమయంలో తాను టీడీపీలోనే ఉన్నాను అంటూ కామెంట్స్‌ చేసింది. రోజా చేసిన ఈ వ్యాఖ్యలు పవన్‌ ఫ్యాన్స్‌కు తీవ్ర స్థాయిలో ఆగ్రహంను కలిగిస్తున్నాయి. దాంతో ఆమె చేస్తున్న జబర్దస్త్‌ షోపై ఈ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ షోలో రోజాతో పవన్‌ సోదరుడు నాగబాబు ఒక జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక జబర్దస్త్‌ షోలో చేసే ఎక్కువ కమెడియన్స్‌ పవన్‌కు వీరాభిమానులు.

జబర్దస్త్‌ షోలో ఎప్పుడు కూడా పవన్‌ చర్చ జరుగుతూనే ఉంటుంది. పవన్‌ను కత్తి మహేష్‌ విమర్శించినందుకు హైపర్‌ ఆది ఏ స్థాయిలో కత్తి మహేష్‌పై కామెంట్స్‌ చేశాడో అందరికి తెల్సిందే. ఇప్పుడు రోజా కూడా పవన్‌ను విమర్శించిన నేపథ్యంలో నాగబాబు మరియు ఇతర కమెడియన్స్‌ ఎలా రియాక్ట్‌ అవుతారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. తన తమ్ముడిని ఆ స్థాయిలో విమర్శించిన రోజా పక్కన నాగబాబు ఎలా కూర్చుంచాడు, తాము ఆరాధించే పవన్‌ను విమర్శించినందుకు రోజాను ఎలా మేడం అంటూ గౌరవించి ఆమెను కమెడియన్స్‌ మార్కులు అడుగుతారు అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.

పవన్‌పై అభిమానం ఉన్న వారు అయితే నాగబాబు కాని, ఇతర కమెడియన్స్‌ కాని రోజాతో ఇకపై జబర్దస్త్‌ షో చేయరు అంటూ కొందరు పవన్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. వెంటనే నాగబాబు జబర్దస్త్‌ను వదిలేయాలని లేదంటే రోజా తప్పుకుంటేనే జబర్దస్త్‌ షోను చేయాలని మెగా ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయమై నాగబాబు ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.