రాజ్ తరుణ్…విజయ్…సినిమా మొదలు

raj tarun new movie started

ఎప్పటికప్పుడు కొత్తదనం వున్న కథలపైనే రాజ్ తరుణ్ దృష్టిపెట్టాడు. సరైన కథల ఎంపిక కోసం కొంత గ్యాప్ తీసుకున్న ఆయన, దర్శకుడు విజయ్ కుమార్ కొండాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కె.కె.రాధా మోహన్ నిర్మిస్తోన్న ఈ సినిమాను, కొంతసేపటి క్రితం లాంచ్ చేశారు.ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ ను తీసుకున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.  రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొంది. ఇక ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఆగష్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రాధా మోహన్ నిర్మిస్తోన్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన అదితీరావు హైదారీ నటించబోతున్నట్లు సమాచారం.